బౌన్సర్ల మధ్య అకిరా నందన్ ?
పవన్ కళ్యాణ్ కొడుకు అకిరానందన్ ప్రస్తుతం పూణే లో తన తల్లి రేణు దేశాయ్ దగ్గర పెరుగుతూ చదువుకుంటున్న సంగతి ఓపెన్ సీక్రెట్. అయితే పవన్ కొడుకు సెక్యూరిటీ పై రేణు చాల జాగ్రత్తలు తీసుకుంటోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. సమ్మర్ హాలిడేస్ కోసం అకిరా ఈమధ్య పవన్ దగ్గరకు వచ్చినప్పుడు కేవలం అకిరా సెక్యూరిటీ కోసమే నలుగురు బౌన్సర్లు అకిరాని కంటికి రెప్పలా కాపాడు కుంటున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తలే నిజం అయితే టాలీవుడ్ లో మంచి స్నేహితులుగా పేరుగాంచిన పవన్ త్రివిక్రమ్ ల పిల్లలు కూడా తమ తండ్రుల స్నేహాన్ని కొనసాగిస్తూ మంచి మిత్రులుగా మారారు అనుకోవాలి. తన తండ్రి వారసత్వాన్ని నటుడిగా కొనసాగిస్తూ అకిరా ‘ఇష్క్ వాలా లవ్’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.