మళ్లీ తెరపై ముదురు అందం.. అలరిస్తుందా..!?

Chakravarthi Kalyan


జయప్రద.. ఒకనాటి అందాలనటి.. దక్షిణ భారతాన్నే కాదు. ఉత్తరాదిని కూడా ఊపేసిన నటి. సత్యజిత్ రే వంటి ప్రపంచ ప్రసిద్ధుడైన డైరెక్టర్ కూడా దేశంలో అంత అందమైన నటి ఇంకొకరు లేరని మెచ్చుకున్నారామెను. 


సాగరసంగమం వంటి చిత్రాల్లో అందాల నటిగానే గాక ప్రతిభ ఉన్న నాయకిగా గుర్తింపు తెచ్చుకుంది. మేఘ సందేశం వంటి చిత్రాల్లో తన అసమాన నటనతో ఆంధ్రదేశాన్ని అలరించింది. వయసైపోయాక.. రాజకీయాలవైపు మళ్లిన కొద్దికాలం ఉత్తరప్రదేశ్ నూ ఊపేసింది.

లేటు వయసులో రాణి పాత్ర


ఇప్పుడు రాజకీయాల్లోనూ అంత యాక్టివ్ గాలేని జయప్రద మనసు మళ్లీ సినిమాలవైపు మళ్లింది. రెండేళ్ల తర్వాత మళ్లీ ముఖానికి రంగేసుకుంటున్నారు. సంజయ్ శర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 


లేటు వయసులోనూ గ్లామర్ పాత్రే పోషిస్తున్నారు. రాణి సాహిబా అనే ఆధునిక రాణి పాత్ర అంగీకరించారు జయప్రద. మరి ఈ ముదురు అందం ఏమేరకు అలరిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: