23న శ్రీకాంత్ డబుల్ యాక్షన్ మూవీ

Prasad
ఇటీవల కాలంలో శ్రీకాంత్ సినిమాలు ఆశించిన విజయాలు పొందలేక పోతున్నాయి. అతని తాజా చిత్రం లక్కీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. మరో చిత్రంతో శ్రీకాంత్ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. దేవరాయ సినిమాతో శ్రీకాంత్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శ్రీకాంత్ నటించిన దేవరాయ సినిమా ఈ నెల 23న విడుదలకు సిద్దమౌతుంది. ఈ సినిమాలోనూ శ్రీ కృష్ణ దేవరాయలుగాను, అమలాపురం దొరబాబు గాను శ్రీకాంత్ డబుల్ యాక్షన్ చేశాడు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ చిత్రంలో శ్రీకాంత్ సరసన మీనాక్షి దీక్షిత్, విదీష నటించారు. నాని కృష్ణ దర్శకత్వం వహించిన ఈ దేవరాయ సినిమాను కిరణ్ జక్కం శెట్టి-నాని కృష్ణ నిర్మించారు. వరుస ఫ్లాపుల నుంచి శ్రీకాంత్ ను దేవరాయ గట్టెక్కిస్తాడని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: