కోలీవుడ్ మీడియాలో ఇప్పుడు హన్సిక త్రిషల స్నేహ బంధం చాలా హాట్ టాపిక్ అయింది. వీరిద్దరూ ఇప్పుడు ఎక్కడ చూసినా చెన్నైలో ఫంక్షన్స్ కు పబ్స్ కు కలిసి వెళుతూ హడావిడి చేయడమే కాకుండా మీడియాకు కలిసి పోజులు ఇస్తూ రచ్చరచ్చ చేస్తున్నారు. అంతేకాదు ఆ ఫోటోలను తమ ఫేస్ బుక్ లో పెట్టి అందరితో షేర్ చేసుకుంటున్నారు.
‘నో క్యాట్ ఫైట్ జస్ట్ సిస్టర్ రొమాన్స్ ' అంటూ హన్సిక తాను త్రిషతో కలిసి తీయిoచుకున్న సేల్ఫీ ఫోటోను అందరికీ తెలిసేలా షేర్ చేసింది. దీనికి త్రిష కూడ వంత పాడుతూ తాను హన్సిక ప్రాణస్నేహితులులా మారిపోయి ఒకరినొకరు విడిచి ఉండలేకపోతున్నాము అంటూ తన ఫేస్ బుక్ లో కామెంట్ చేసింది.
అయితే జరుగుతున్న ఈ వ్యవహారాన్ని అంతా గమనించిన కోలీవుడ్ హీరో ఆర్యా వీరి పై ఘాటైన కామెంట్స్ చేస్తూ ఒక ట్విట్ పోస్ట్ చేసాడు. ‘హన్సిక, త్రిష కంగ్రాట్స్ ఇద్దరి హార్ట్స్ ఎప్పటికీ బ్రేక్ కాకుండా ఉండేందుకు మీరిద్దరు ఫాలో అవుతున్నది సేఫెస్ట్ లవ్ ఎపైర్, కాని రేపు ఏమవుతుందో తెలియదు' అంటూ సెటైర్లు వేసాడు ఆర్య.
వరుణ్ మన్యన్ తో మ్యారేజ్ ఎంగేజ్ మెంట్ బ్రేకప్ అయ్యాక త్రిష, శిoభూతో లవ్ ఎఫైర్ బ్రేకప్ అయ్యాక హన్సిక వరసపెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నా ప్రేమించడానికి ప్రస్తుతం హీరోలు ఎవ్వరూ దొరకక పోవడంతో వీరిద్దరూ ఒకరినిఒకరు ఘాడంగా ప్రేమించు కుంటూ ఇలా సెల్ఫీలకు పోజులు ఇస్తున్నారు అనుకోవాలి. మరి వీరి స్నేహబంధం ఎంత కాలం ఇలా కొనసాగుతుందో చూడాలి..