‘బాహుబలి’ ‘శ్రీమంతుడు’ రికార్డులను క్రియేట్ చేయడంతో ఆ ప్రభావం పవన్ జూనియర్ బాలయ్యలకు టెన్షన్ గా మారింది అన్న వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ ఎంపరర్ గా రికార్డులను సృస్టించిన పవన్ ‘అత్తారింటికి దారేది’ రికార్డును ‘శ్రీమంతుడు’ తుడిచి వేయడంతో ఎలర్ట్ అయిన పవన్ తాను నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విషయంలో అన్నీ తానై చూసుకుంటూ పవన్ అత్యంత శ్రద్ద కనిపిస్తున్నాడని టాక్.
అదేవిధంగా బలాక్రిష్ణ నటిస్తున్న ‘డిక్టేటర్’ సినిమా విషయంలో కూడ బాలయ్య తన వయస్సును కూడ పట్టించుకోకుండా కుర్ర హీరోలతో సమానంగా ఆ సినిమా పాటలలో స్టెప్స్ వేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక జూనియర్ అయితే సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించడమే కాకుండా సెప్టెంబర్ చివరి వరకు ఇండియాకు కూడా రాకుండా ఈసినిమా షూటింగ్ ను చాల ఏకాగ్రతతో లండన్ తదితర ప్రదేశాలలో పూర్తి చేస్తున్నాడు.
ఈమూడు సినిమాల షూటింగ్ ప్రస్తుతం చాల వేగంగా జరుగుతూ ఉండటమే కాకుండా ఈ ముగ్గురు హీరోలు కూడ సంక్రాంతి రేస్ ను టార్గెట్ చేస్తూ రావాలని నిశ్చయించుకోవడం అందర్నీ ఆశ్చర్య పరచడమే కాకుండా ఇది జరిగే పనేనా అన్న కామెంట్స్ కు తావిస్తోంది. ఇప్పటికే జూనియర్ తో సినిమాను తీస్తున్న బివిఎస్ఎన్ ప్రసాద్ జూనియర్ ‘నాన్నకు ప్రేమతో’ జనవరి 8న రాబోతోందని అధికారికంగా ప్రకటించాడు.
పవన్ తో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాను తీస్తున్న శరత్ మరార్ కూడా ఈసినిమాను కొనుక్కున్న ఈరోస్ సంస్థకు జనవరి 10న ఎట్టి పరిస్తుతులలోను విడుదల చేస్తాను అని మాట ఇచ్చినట్లు టాక్. ఇక బాలయ్య అయితే తనకు సెంటిమెంట్ గా కలిసి వచ్చే జనవరి 14 సంక్రాంతి నాడు ‘డిక్టేటర్’ విడుదల కావాలని పట్టుదల పై ఉన్నాడని సమాచారం. ఈ ముగ్గురూ ఇలా సంక్రాంతిని టార్గెట్ చేయడం వెనుక ఒక ఎత్తుగడ ఉంది అని అంటున్నారు. టాప్ హీరోల సినిమాల టాక్ తో సంబంధం లేకుండా రెండు వారాల పాటు సంక్రాంతి సినిమా ఫీవర్ ఉంటుంది కాబట్టి ఆ ఫీవర్ తో ఏదోవిధంగా ‘శ్రీమంతుడు’ కలెక్షన్స్ ను దాటాలని ఈ ముగ్గురి హీరోల వ్యూహం. వీరి ఆలోచనలు బాగున్నా ఇది సాధ్యమా దీనికి బయ్యర్లు అంగీకరిస్తారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చివరకు ఈ రేసులో ఎవరు వస్తారు అన్నది సస్పెన్స్..