ఫ్యామిలీ స్టేటస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన అఖిల్ !

Seetha Sailaja


అక్కినేని అఖిల్ తన కుటుంబ వారసత్వం పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకుటుంబ నేపధ్యం గురించి అలాగే తాను నటిస్తున్న ‘అఖిల్’ సినిమా గురించి అనేక ఆశక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు అఖిల్. తాను అక్కినేని కుటుంబంలో పుట్టినందుకు చాలగర్వపడతానని అంటూ మూడుతరాలుగా తమను అభిమానిస్తున్న వీరాభిమానులు తమకుటుంబానికి ఉండటం తనఅదృష్టం అని భావిస్తున్నా అని అంటూ ఈ అదృష్టంలోనే ఒక దురదృష్టం ఉంది అంటూ షాకింగ్ కామెంట్ చేసాడు అఖిల్.

తనకు ఏర్పడిన స్టార్ స్టేటస్ వల్ల సరదాగా తన స్నేహితులతో కలిసి ఒక కాఫీ షాప్ కు కూడ వెళ్ళలేకపోతున్నానని అయినా ఎదోవిధంగా ప్రయత్నించి తనస్నేహితులతో బయటకువచ్చినప్పుడు ఆసందర్భంలో తనస్నేహితురాలు కాని లేదా తనచుట్టాల అమ్మాయి కాని కనిపించి తనను పలకరిస్తే ఆవిషయాలను మర్నాడే ఫేస్ బుక్ లో  ఫోటోలతో సహా పెట్టేస్తూ ఉండటంతో తనవల్ల తన స్నేహితులకు ఇబ్బంది కలగకూడదని తాను తనస్నేహితులతో కలిసే సందర్భాలను కూడ తగ్గించి వేసుకున్నానని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు అఖిల్.

ఇక తాను తన ‘అఖిల్’ సినిమాను మొదలు పెట్టినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నానో ఆసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ తనకు టెన్షన్ పెరిగిపోతోందని ఇప్పటికే తనను అక్కినేని అభిమానులు ‘సిసింద్రీ’ గా గుర్తించి తనకంటూ ఒకప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరిచిన నేపధ్యంలో తనఅభిమానుల అంచనాలను ‘అఖిల్’ ద్వారా అందుకోగలనా అనే టెన్షన్ తనను ప్రస్తుతం వెంటాడుతోంది అంటూ కామెంట్స్ చేసాడు అఖిల్.

ఇక తన లేటెస్ట్ మూవీ టైటిల్ ను తనపేరుతోనే పెట్టడంతో తనకు అప్పుడే అంత స్టార్ డమ్ ఏర్పడిందా అని కొందరు కామెంట్ చేస్తున్న విషయం తనదృష్టి వరకు వచ్చిందని చెపుతూ ‘అఖిల్’ అంటే విశ్వం అని అర్ధమని చెపుతూ ఈ విశ్వానికి ప్రమాదం ఏర్పడినప్పుడు ఆప్రమాదం నుండి ఈవిశ్వాన్ని ఈసినిమాలో హీరో రక్షిస్తాడు కాబట్టి తనసినిమాకు తనపేరునే టైటిల్ గా మార్చారు అన్నవిషయాన్ని బయటపెట్టాడు అఖిల్. తన తాత అక్కినేని ఆత్మ ఎక్కడ ఉన్నా ఆయన పుట్టినరోజునాడు జరగబోయే తనసినిమా ఆడియో ఫంక్షన్ లో తనను ఆశీర్వదిస్తారనే నమ్మకం తనకు ఉంది అంటూ అఖిల్ తన సినిమా గురించి ఎన్నోవిషయాలను ఈ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు..    



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: