ఆ క్రిమినల్ పై మోజు పడ్డ లావణ్య త్రిపాఠి !

Seetha Sailaja


‘అందాల రాక్షసి’ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయిన ఈ ఉత్తరాఖాండ్ హీరోయిన్ సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి అంటే ఎవరైనా ఆశ్చర్య పోతారు. 2006లో మిస్ ఉత్తరాఖండ్ గా ఎన్నికైన ఈమె టాలీవుడ్ కెరియర్ మొన్న విడుదలైన ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో దశ తిరగడమే కాకుండా ప్రస్తుతం టాలీవుడ్ లోని ప్రముఖ దర్శక నిర్మాతల దృష్టి తన పై పడేలా చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్ నిమిత్తం ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.

తాను కాలేజిలో చదివేడప్పుడు రబ్బరు బొమ్మలా బాగున్నాను అని తన వెంట అబ్బాయిలు వెంటపడుతూ తెగ అల్లరి చేసేవాళ్ళని అయితే ఆ అల్లరి వల్లే తనకు అందరితో పరిచయాలు పెరిగి ధైర్యం వచ్చిందని మోడలింగ్ ప్రోఫిషన్ లోకి వెళ్ళాలనే కోరిక వచ్చిందనే తన నేపధ్యాన్ని వివరించింది. ఆ తరువాత సినిమాల పై ఇష్టం ఏర్పడటంతో హిందీ సినిమాలతో పాటు దక్షిణాదికి చెందిన సినిమాలు అన్నీ వరస పెట్టి చూస్తూ ఉన్న సందర్భంలో తనకు నాగార్జున పట్ల అభిమానం ఏర్పడటమే కాకుండా నాగ్ నటించిన ‘క్రిమినల్’ సినిమాను ఎన్ని సార్లు చూసానో తనకు లెక్కేలేదు అంటూ నాగ్ ను ఆకాశానికి ఎత్తేసింది ఈ అందాల రాక్షసి.

అయితే అదే నాగార్జున పక్కన హీరోయిన్ గా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో నటించినప్పుడు తాను తన జీవితంలో ఒక అద్భుత విజయం సాధించినట్లు భావించానని అంటూ నాగార్జున అంత మంచి మనిషిని తాను చూడలేదు అంటూ నాగ్ పై తన అభిమానాన్ని వ్యక్త పరిచింది. కథక్ డాన్సర్ గా అనుభవం ఉండటంతో తనకు ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలో క్లాసికల్ డాన్సర్ గా నటించడం చాల సులువైంది అని అంటోంది లావణ్య త్రిపాఠి. 

ఇక హీరో నాని గురించి మాట్లాడుతూ తన కాలేజి ఫ్రెండ్ లా నాని తనకు కనిపించాడని అంటూ హీరో అన్న అహంకారం నానీలో ఎక్కడా కనిపించదని చెపుతూ తాను ఎలా నటించాలో తనకు అర్ధం అయ్యే రీతిలో చూపెట్టడమే కాకుండా తనను ఎంతగానో ప్రోత్సహించిన నానీతో ఇంకా తనకు చాల సినిమాలను చేయాలని ఉంది అని అంటోంది ఈ రబ్బరు బొమ్మ..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: