మొన్నా మధ్య దిల్ రాజు మూడు కొత్త టైటిల్స్ ని తన బ్యానర్లో రిజిస్టర్ చేయించాడని మీడియా తెగ హడావిడి చేసింది. అయితే వాటిలో రెండు టైటిల్స్ మాత్రం ఎవరికో కనిపెట్టేశారు కాని మిగిలిన మూడోది అదేనండి ఎవడో ఒకడు అనేది ఎవరికో అర్ధం కాలేదు. అయితే తెలుస్తున్న వార్తల ప్రకారం ఆ సినిమా టైటిల్ రవితేజ సినిమా కోసం దిల్ రాజు రిజిస్టర్ చేయించాడని ఫిల్మ్ నగర్లో టాక్. ప్రస్తుతం బెంగాల్ టైగర్ సినిమా చేస్తున్న రవితేజ ఆ సినిమా తర్వాత ఓ మై ఫ్రెండ్ దర్శకుడు వేణు శ్రీరామ్ డైరక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎవడో ఒకడు అని పెట్టే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు. కిక్-2 తో కాస్త డీలా పడ్డ రవితేజ బెంగాల్ టైగర్ తో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఇక దిల్ రాజు ఎవడో ఒకడుతో కూడా హిట్ కొట్టి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కోసం ట్రై చేస్తున్నాడు రవితేజ. ఇకనుండి స్క్రిప్ట్ పరంగా కూడా చాలా కేర్ ఫుల్ గా నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నాడు.
కిక్-2 సినిమాలో రవితేజ :
మరి ఎవడో ఒకడుగా వస్తున్న మాస్ మహ రాజ్ అభిమానులను ఎలా అలరిస్తాడో చూడాలి. కెరియర్లో కాస్త వెనుకబడి ఉన్న రవితేజకు ఈ టైంలో ఒక మంచి జోష్ ఫుల్ హిట్ చాలా అవసరం. అంతేకాదు సినిమా కోసం రవితేజ రెమ్యునరేషన్ కూడా తగ్గించాడని వినిపిస్తుంది.
చిన్న సినిమాలతో లాభం లేదని వరుసెంట పెద్ద సినిమాలకు ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. ఇప్పటికే మహేష్, రవితేజ, పవన్ కళ్యాణ్ లాంటి వారితో సినిమాలకు డేట్స్ తీసుకున్నాడని సమాచారం.