మెగాస్టార్ చిరంజీవి జడ్జిమెంట్ తప్పిందా ? అంటూ ఫిలింనగర్ లో వినపడుతున్నసెటైర్లు చాలామందికి ఆశ్చర్యం కలిగుస్తున్నాయి అని టాక్. సినిమాలకు చిరంజీవి దూరమై 9సంవత్సరాలు గడిచిపోవడంతో ప్రస్తుతం సినిమాల ఘనవిజయాన్ని శాసిస్తున్న 18 నుంచి 22 సంవత్సరాల వయసు మధ్య ఉన్న యూత్ నాడిని పట్టుకోవడంలో చిరంజీవి ఫెయిల్ అవుతున్నాడు అంటూ కొందరు విశ్లేషణలు చేస్తున్నారు.
మూడు దశాబ్దాల పాటు టాలీవుడ్ ను చిరంజీవి తన సినిమాలతో శాసించినా ప్రస్తతం టాలీవుడ్ లో నడుస్తున్న ట్రెండ్ చిరంజీవికి సరిగా అర్ధం కాకపోవడంతోనే తన 150వ సినిమా కథ విషయంలో చిరంజీవి అయోమయానికి గురి కావడమే కాకుండా తన కొడుకు రామ్ చరణ్ సినిమాల కథల ఎంపిక విషయంలో కూడ తప్పటడుగులు వేస్తున్నాడని విశ్లేషకుల అంచనా.
దీనికి ఉదాహరణగా గతంలో ‘మిర్చి’ సూపర్ హిట్ తరువాత కొరటాల శివ నిర్మాత బండ్ల గణేష్ కాంబినేషన్ కాదనుకొని దర్ళకుడు కృష్ణ వంశీ చెప్పిన కధకు ఓకే చెప్పి చరణ్ తో ‘గోవిందుడు అందరివాడేలే’ ప్రాజెక్టును సెట్ చేయడం అని అంటున్నారు. అదే విధంగా శ్రీను వైట్ల దర్శకత్వంలో చరణ్ చేస్తున్న ‘బ్రూస్ లీ’ సినిమా కథ ఎంపిక విషయంలో కూడ చిరు కీలక పాత్ర పోషించడంతో ఈసినిమా కథ విషయంలో తాను మొదట్లో అనుకున్న కధకు చాలా మార్పులు చేయవలిసి వచ్చిందని తన సన్ని హితుల మధ్య శ్రీను వైట్ల బాధ పడుతున్నట్లు టాక్.
దీనితో మారుతున్న ప్రేక్షకుల అభిరుచిని చిరంజీవి పసిగట్టలేకపోతున్నాడా ? అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారని తెలుస్తోంది. దీనికి తోడు ఈమధ్య చిరంజీవి ఏదైనా ఒక సినిమా ఫంక్షన్ కు అతిథిగా వచ్చినప్పుడల్లా ఆ దర్శకుడిని ఒక మంచి కధను తన 150వ సినిమాకు ఆలోచించమని చిరంజీవి బహిరంగంగా అడగడం బట్టి చిరూ ప్రస్తుతం ఎంత అయోమయంలో ఉన్నడో అర్ధం అవుతోంది అంటూ కొందరు రచయితలు ఫిలింనగర్లో కామెంట్ చేస్తున్నట్లు టాక్. తెలుగు సినిమా మార్కెట్ ను పెంచిన చిరంజీవి పై ఇటువంటి సెటైర్లు పడటం దురదృష్టకరం అనుకోవాలి..