షాకింగ్ గుణశేఖర్ భార్యను కంటతడి పెట్టించిన యూనిట్ సభ్యుడు !

Seetha Sailaja


ఈవారం విడుదల కాబోతున్న ‘రుద్రమదేవి’ తనను తన కుటుంబాన్ని ఎంత టార్చర్ పెట్టిందో గుణశేఖర్ భార్య రాగిణి గుణ చెప్పిన మాటలు చదివితే ఎవరికైనా బాధ కలుగుతుంది. సినిమా కష్టాలు అంటే ఏమిటో తమ కుటుంబానికి ‘రుద్రమదేవి’ ప్రత్యక్షంగా రుచి చూపించిందని రాగిణి ఈసినిమా పై సంచలన వ్యాఖ్యలు చేసింది. 


సినిమా నిర్మాణం పూర్తి అయినా రకరకాల కారణాలతో ఈసినిమా వాయిదా పడుతూ ఉంటే చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి పోతున్న నేపధ్యంలో అసలు ఈసినిమా కష్టాల నుండి తాము బయట పడగలమా అనే భయం రోజురోజుకు పెరిగి పోయిందని అంటూ ఈ సినిమా విడుదల కోసం ఎందరో సహాయ పడ్డారు అన్న విషయాన్ని చెపుతూ ఒక ఆసక్తికర విషయాన్ని బయట పెట్టింది. 

ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులలో ఒకరోజు తన వద్ద ఆరోజు నిర్మాణ సిబ్బందికి ఇవ్వవలసిన డబ్బులు కూడ తన వద్ద లేవని అలాంటి పరిస్థుతులలో ఏమి చేయాలో తెలియక దిగులుగా కూర్చున్న తన వద్దకు తమ సినిమా యూనిట్ లోని ఒక చిన్న నటుడు తన దగ్గరకు వచ్చి ‘మేడమ్ నాకు ఇవ్వాళే వేరే సినిమా యూనిట్ నుండి డబ్బు వచ్చింది ఆ డబ్బు నేను అందరికీ పంచాలి, కాని అది మీరు తీసుకోండి వారం పదిరోజులు ఏదోవిధంగా ఈ వ్యవహారాన్ని మేనేజ్ చేస్తాను’ అంటూ తన చేతిలో డబ్బు పెట్టిన ఆ వ్యక్తి కోటీశ్వరుడు కాదని అంటూ ఆ వ్యక్తి తన కంట కన్నీరు వచ్చిందని చెపుతూ అటువంటి ఎందరో వ్యక్తుల సహాయంతో ‘రుద్రమదేవి’ విడుదల అవుతోంది అని కామెంట్స్ చేసింది రాగిణి గుణశేఖర్. 

మూడేళ్ళ క్రితం వరకు తన ఇల్లు తన పిల్లలు తప్ప ప్రపంచం ఎరుగని తనకు తన భర్త గుణశేఖర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రుద్రమదేవి’ గురించి పడుతున్న పాట్లను గమనించి తాను గుణశేఖర్ కు సహాయంగా సినిమా నిర్మాతగా అవతారం ఎత్తిన తరువాత జీవితంలో ఎప్పుడూ పడని కష్టాలను పడేలా ఈ ‘రుద్రమదేవి’ తమ కుటుంబ సభ్యులను వేదించినా తన భర్త ఆనందం కోసం ఈసినిమాను కష్టపడి పూర్తి చేసామని మంచి సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు ఈసినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను అంటూ ‘రుద్రమదేవి’ పై ఎంతో నమ్మకం, ఆశలు పెట్టుకుంది రాగిణి గుణశేఖర్..     



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: