అనుష్క పంచ్ లకు షాక్ అయిన మీడియా !

Seetha Sailaja


అనుష్క ‘రుద్రమదేవి’ ప్రమోషన్ కు ఇస్తున్నఇంటర్వ్యూలలో ఆసినిమాను ప్రమోట్ చేస్తూ మరోవైపు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల పై కూడ ఆసక్తికర సమాధానాలు ఇస్తోంది. అంతేకాదు తన ప్రేమ వ్యవహారం గురించి అదేవిధంగా తన ఎఫైర్ల గురించి తరుచు మీడియాలో వచ్చే గాసిప్పుల పై విలక్షణ సమాధానాలు ఇచ్చింది. 

ఇదే సందర్భంలో ఒక మీడియా సంస్థ ప్రతినిధి కోలీవుడ్ హీరో ఆర్యాతో ఆమెకు ఉన్న సానిహిత్యం గురించి ప్రశ్నించినప్పుడు అనుష్క చాల వెరైటీగా స్పందించింది. తాను నటిoచిన ప్రతి హీరోతోను తనకు లింకులు పెడుతూ వార్తలు వ్రాయడం మీడియాకు ఒక హాబీగా మారింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

అయితే తాను రానాతో కలిసి సినిమాలు చేస్తున్నా తమ ఇద్దరి పై మీడియా వార్తలు వ్రాయకపోవడం తనకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుందని అంటూ మీడియా పై సెటైర్లు వేసింది అనుష్క. రానాను ‘బ్రదర్’ అని పిలుస్తానని అందువల్ల దయతలిచి మీడియా తమ పై గాసిప్పులు వ్రాయడానికి మొహమాట పడుతోందేమో అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది యోగా బ్యూటీ. 

ఇదే సందర్భంలో తనను లేడీ సూపర్ స్టార్ అని పిలవవచ్చా అని మరొక మీడియా సంస్థ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆ బిరుదు ఒకనాటి ఒక ప్రముఖ హీరోయిన్ కు సంబంధించింది అని అంటూ తన కంటే ఎంతో సీనియర్ అయిన ఆ నటి ఎన్నో ప్రముఖ పాత్రలను పోషించింది అని చెపుతూ తాను కూడ ఆమె రేంజ్ లో మరో 20 సంవత్సరాలు మెప్పిoచ గలిగితే అప్పుడు అటువంటి బిరుదులు గురించి ఆలోచిస్తాను అంటూ వ్యాఖ్యలు చేసిన అనుష్క మాటలను బట్టి ఆమె ఎంత వాస్తవిక దృష్టితో ఉందో అర్ధం అవుతుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: