నాగ్ స‌ర‌స‌న చంద‌మామ‌..క్లారిటీ ఇచ్చేసిందిగా.!

MADDIBOINA AJAY KUMAR
పెళ్ల‌య్యాక చాలా మంది హీరోయిన్ లు త‌మ రూట్ మార్చుకుంటారు. గ్లామ‌ర‌స్ పాత్ర‌ల కంటే త‌మ న‌ట‌న‌కు ప్రాధాన్య‌త ఉన్న పాత్రల్లో న‌టించేందుకే మొగ్గు చూపుతుంటారు. ఇప్పుడు అదే లిస్ట్ అందాల చంద‌మామ కాజ్ అగ‌ర్వాల్ కూడా చేరిపోయిన‌ట్టు అనిపిస్తుంది. ప్ర‌స్తుతం కాజల్ ఆచి తూచి అడుగులు వేస్తోంది. అంతే కాకుండా గ్లామ‌ర‌స్ రోల్స్ ను కూడా ప‌క్క‌న పెట్టాల‌ని చూస్తోంద‌ట‌. ఇప్ప‌టికే ఈ భామ మంచు విష్ణు హీరోగా నటించిన మోస‌గాళ్లు సినిమాలో విష్ణు కు అక్క‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడు నాగార్జున స‌ర‌స‌న హీరోయిన్ న‌టించ‌డానికి సిద్ధ‌మౌతోంది. ఇప్ప‌టికే నాగ్ సినిమాలో కాజ‌ల్ అంటూ వార్త‌లు వ‌చ్చినా కాజ‌ల్ అగ‌ర్వాల్ స్పందిచ‌లేదు. కానీ తాజాగా మోస‌గాళ్లు సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఇచ్చిన ఇంట‌ర్యూలో ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది. తాను ప్రస్తుతం మెగాస్టార్ ప‌క్క‌న ఆచార్య సినిమాలో న‌టిస్తున్నాన‌ని...అంతే కాకుండా నాగార్జున కు జోడీగా త‌దుప‌రి చిత్రంలో న‌టిస్తున్నాన‌ని వెల్ల‌డింది. మ‌రోవైపు ‘ఘోస్టీ’ అనే తమిళ సినిమాతో పాటు మరో తమిళ సినిమా చేస్తున‌ని స్ప‌ష్టం చేసింది.
ఇక‌ ‘ఇండియన్‌ 2’ సినిమా ప్రస్తుతం ఆగిపోయిందని.... తాను న‌టించిన‌ లైవ్‌టెలీకాస్ట్‌ వెబ్‌సిరీస్‌కు మిశ్రమ స్పందన వచ్చిందని తెలిపింది. ఆల‌స్యంగా విడుద‌ల‌చేయ‌డ‌మే దానికి కార‌ణం అనుకుంటున్నానని తెలిపింది. వెబ్‌సిరీస్‌లు చేసే ఆలోచన ఉందని..క‌థ‌లు కుదిరితే త‌ప్ప‌కుండా చేస్తాన‌ని కాజ‌ల్ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా కాజల్ ఈ సంధ‌ర్భంగా మ‌రో న్యూస్ చెప్పింది. తాను హోస్ట్‌గా ఓ షో కూడా ఉండొచ్చని తెలిపింది. అయితే షో ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేనని తెలిపింది. అంతే కాకుండా కాజ‌ల్ మోస‌గాళ్లు సినిమా గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది. మోసగాళ్ళు’ లాంటి సినిమాను త‌న‌ కెరీర్‌లో ఇప్పటివరకు చేయలేదని తెలిపింది. రెగ్యులర్‌ కమర్షియల్‌ రోల్స్‌ కాకుండా అను వంటి ఓ డిఫరెంట్‌ రోల్‌ చేయడం సంతోషంగా ఉందని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: