మెగాస్టార్ ప్లాన్ కి కాలర్ ఎగరేస్తున్న మెగా అభిమానులు....

Purushottham Vinay
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్స్ వున్నా కాని మెగాస్టార్ మెగాస్టారే.. ఇక తన సుధీర్గమైన రాజకీయ ప్రయాణం తరువాత మళ్ళీ వరుస పెట్టి సినిమాలు చేస్తూ అభిమానులను ఫుల్ గా ఖుషి చేస్తున్నాడు. ఇక వరుస సినిమాలతో బిజీగా దూసుకుపోతున్నాడు.ఇక మెగాస్టార్ దూకుడు అయితే మాములుగా లేదు. కుర్ర హీరోల కంటే కూడా ఎంతో ఫాస్ట్ గా దూసుకుపోతున్నాడు.ఈ హీరోల కంటే వేగంగా సీనియర్ స్టార్ హీరో చిరంజీవి హీరోగా నటిస్తున్న నాలుగు సినిమాలు రాబోయే రెండేళ్లలో విడుదల కానున్నాయి. పదేళ్లు రాజకీయాల్లో బిజీ కావడం వల్ల సినిమాలకు దూరమైన చిరంజీవి రీఎంట్రీలో వరుసగా సినిమాలకు కమిటవుతూ ఉండటం గమనార్హం.ఈ ఏడాది మార్చి నెల 13వ తేదీన చిరంజీవి నటించిన ఆచార్య సినిమా విడుదల కానుంది. ఈ సినిమాల తరువాత చిరంజీవి లూసిఫర్, వేదాళం రీమేక్ లలో నటిస్తున్నారు. లూసిఫర్ సినిమాకు ఎంతోమంది డైరెక్టర్ల పేర్లను పరిశీలించిన చిరంజీవి చివరకు ఈ సినిమాకు డైరెక్టర్ గా కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజాను ఖరారు చేశాడు.



ఈ ఏడాదే లూసిఫర్ రీమేక్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా తరువాత మెహర్ రమేష్ డైరెక్షన్ లో వేదాళం సినిమాలో చిరంజీవి నటించబోతున్నారు. ఈ సినిమాతో పాటు చిరంజీవి బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. కుర్ర హీరోల కంటే వేగంగా సినిమాల్లో నటిస్తూ ఏడాదికి రెండు సినిమాలు విడుదలయ్యే విధంగా చిరంజీవి కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ ఉండటం నిజంగా మెచ్చుకోదగిన విషయమే. ఇక మెగాస్టార్ స్పీడ్ ని చూసి మెగా అభిమానులైతే కాలర్ ఎగరేస్తున్నారు.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: