హైపర్ ఆది పరువు తీసేసిన 'హాయ్ ఫ్రెండ్స్ వెంకట సుబ్బయ్య'..అందరి ముందు అంత మాట అన్నాడేంటి..??
హాయ్ ప్రెండ్స్, బాయ్ ప్రెండ్స్, ఊరికే ప్రెండ్స్ నవ్వాలనిపించింది, ఊరికే ప్రెండ్స్ హాయ్ చెప్పాలనిపించింది అంటూ వెంకట సుబ్బయ్య టిక్‌టాక్‌లో చేసిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఇక ఇతగాడిపై మీమ్‌లే కాదు వాట్సాప్‌లోనూ స్టిక్కర్లు వచ్చాయి. ఇలా వెంకట సుబ్బయ్య మంచి ఫేమ్‌ని సంపాదించుకున్నాడు. అంతేకాదు అతడిని చాలా మంది ఇమిటేట్ కూడా చేస్తుంటారు.ఈ క్రమంలో ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెళ్లలోనూ ఇతడికి అవకాశాలు వస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఢీలో సందడి చేశాడు లాఫింగ్ స్టార్ వెంకట సుబ్బయ్య. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో మార్చి 24కు సంబంధించి ప్రోమో విడుదల అయ్యింది.
అందులో కింగ్స్ మెంటార్లు సుడిగాలి సుధీర్, హైపర్ ఆదిలతో కలిసి కెమెరా ముందుకు వెళ్లి హాయ్ ప్రెండ్స్ అంటూ సందడి చేశాడు వెంకట సుబ్బయ్య.మీకు ఇష్టమైతే లైక్ కొట్టండి, లేదంటే లేదు బాయ్ ప్రెండ్స్ అంటూ తన నవ్వుతో అందరినీ నవ్వించాడు సుబ్బయ్య. ఇక సుధీర్ అన్న చాలా అందంగా ఉన్నాడు కదా అని హైపర్ ఆది అనగా.. కిందపడి నవ్వాడు. ఆ తరువాత దీపిక.. ఆది గారు చాలా అందంగా ఉన్నారు కదా అని అడగ్గా.. అసలు లేడు అంటూ హైపర్ ఆది గాలి తీసేశాడు వెంటక సుబ్బయ్య.ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..!!