సిగ్గు, వినమ్రత వల్ల ఇబ్బందుల్లో పడుతున్న నాగచైతన్య.. ఏంట్రా ఇది అంటున్న నాగార్జున...

Suma Kallamadi
నాగ చైతన్యకి చాలా సిగ్గు ఎక్కువ అని సమంత అక్కినేని ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు. ఇండస్ట్రీలో క్లీన్ ఇమేజ్ ఉన్న హీరోలలో నాగచైతన్య పేరు మొదటి వరుసలో ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎవరితోనూ ఎటువంటి గొడవలు గాని తగాదాలు గానీ అస్సలు పెట్టుకోరు. సిగ్గుతో పాటు వినమ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఆయనకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయట. ఇంతకీ ఏ విషయంలో ఆయన ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకుంటే.. దర్శకనిర్మాతలకు నాగ చైతన్య ని సంప్రదించడం, సినిమాలకు అంగీకరించడం చాలా ఈజీ టాస్క్ అట.

ఎందుకంటే ఆయన తన వినమ్రత వల్ల ఏ డైరెక్టర్ వచ్చి కథ చెప్పినా రిజెక్ట్ చేయలేకపోతారట. ఐతే ఆ అతి మంచితనం వల్ల చైతూ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా అయ్యిందని చాలామంది అంటుంటారు. ప్రస్తుతానికి నాగచైతన్య విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న థాంక్యూ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. సాహు గారపాటి నిర్మాణంలో మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కనున్న మరొక సినిమాలో కూడా ఆయన హీరోగా నటించడానికి ఓకే చెప్పారు.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వస్తున్న ఓ సినిమా చేయడానికి కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న మరొక చిత్రం లో కూడా ఆయన నటిస్తున్నారు. చదువుకి సంబంధించిన కథతో తెరకెక్కుతున్న వెంకీ అట్లూరి ఫిల్మ్ లో నటించేందుకు కూడా చైతూ పచ్చజెండా ఊపారు. వరుసగా 5 సినిమాల్లో నటించేందుకు నాగచైతన్య ఒప్పుకున్నారు. అయితే అక్కినేని నాగార్జున బంగార్రాజు సినిమాని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాలో ఒక పాత్ర కోసం నాగచైతన్యని నాగార్జున అడుగుతున్నారట. కానీ ఇప్పటికే చైతు చాలా సినిమాలతో బిజీ కావడంతో నాగార్జున ఉసూరుమంటున్నారు. ఏంట్రా ఇది.. ఇంత వినమ్రత పనికిరాదు. వచ్చిన ప్రతి సినిమాకి ఓకే చెప్పడం సరికాదు' అని చైతన్య తో నాగార్జున అన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఈ సినిమాలన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయా లేదా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: