తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్న హీరోహీరోయిన్లు వీళ్ళే..!?
తెలుగు చిత్ర పరిశ్రమలో అలనాటి హీరోలు నాగార్జున అక్కినేని, మెగాస్టార్ చిరంజీవి. వీరిద్దరి గురించి తెలియని వారంటూ ఉండరు. తమదైన శైలిలో సినిమాలో నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. ఇక అలనాటి అగ్రహీరోలైన నాగార్జున, చిరంజీవి మంచి స్నేహితులు. వీరిద్దరి స్నేహం ఇప్పటికీ ఎలాంటి మనస్పర్థలు లేకుండా కొనసాగుతూనే ఉంది.
ఇక చిత్ర పరిశ్రమలో ఒక్కప్పుడు వెంకటేష్, సౌందర్య కాంబినేషన్ ఎంత సూపర్ హిట్ అయ్యిందో.. ఇక వీరిద్దరి కాంబినేషన్ కూడా అంతే సూపర్ హిట్ అయ్యింది. వారే ప్రభాస్, అనుష్క శెట్టి. సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రభాస్, అనుష్కల జంట చుడముచ్చటగా ఉంటుంది. వీరిద్దరు లవ్‌లో ఉన్నారని.. త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారని గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఓ టీవీ షోలో అనుష్క ప్రభాస్ తన బెస్ట్ ఫ్రెండ్ అని క్లారిటీ ఇచ్చింది.
మహేష్ బాబు, తలపతి విజయ్ మంచి ఫ్రెండ్స్. మహేష్ తన స్కూల్, కాలేజీ చదువును చెన్నైలో పూర్తిచేశాడు. ఆ సమయంలో సూర్య, కార్తీ, తలపతి విజయ్ క్లాస్మేట్స్. కాలేజీ రోజులలో నుంచే తలపతి విజయ్, మహేష్ బాబు విజయ్ అత్యంత ప్రాణస్నేహితులుగా మారారు. అల్లు అర్జున్, ప్రభాస్.. వీరిద్దరు మంచి స్నేహితులు.. వీరిని తమ అభిమానులు జై-వీరు అని పిలుస్తుంటారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వీరిద్దరు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బెస్ట్ ఫ్రెండ్స్. గతంలో వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో అభిమానులు గొడవను క్రియేట్ చేయగా.. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని.. ఫ్యాన్స్ వారి మధ్య మనస్పర్థలు తీసుకురావద్దని గతంలో వీరిద్దరు సోషల్ మీడియాలో కోరారు.