పరిస్థితి చూస్తుంటే .... యుద్ధం తప్పేలా లేదే ... ఏమి జరుగుతుందో ఏమో మరి .... ??
గతంలో బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు రెండూ కూడా ఒక దాన్ని మించి మరొకటి అత్యద్బుత విజయాలు అందుకుని వీరి కాంబినేషన్ కి అభిమానుల్లో మంచి క్రేజ్ ఏర్పరిచిన విషయం తెలిసిందే. అయితే ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా వాటిని మించేలా మరింత అద్భుతంగా దర్శకుడు బోయపాటి ఈ సినిమాని మరింత జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారని ఇన్నర్ వర్గాల టాక్. గత ఏడాది బాలయ్య జన్మదినం సందర్భంగా రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ కి అందరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమా ఈ ఏడాది మే 28న రిలీజ్ చేయనున్నారు. మరోవైపు ఇటీవల క్రాక్ మూవీ తో కెరీర్ పరంగా అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్న మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం చేస్తున్న సినిమా ఖిలాడి. రమేష్ వర్మ దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ పై మాస్ రాజా ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
మంచి యాక్షన్ తో కూడిన థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా పలు కమర్షియల్ హంగుల కలబోతగా ఈ మూవీ తెరకెక్కుతోందని తప్పకుండా క్రాక్ తర్వాత రవితేజ ఖాతాలో ఈ సినిమా మరో సక్సెస్ ని నమోదు చేయడం ఖాయమని ఖిలాడీ యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాను కూడా మే 28న రిలీజ్ చేయనున్నారు. నిజానికి ఈ రెండు సినిమాలు ఒకేసారి ఒకే రోజు రిలీజ్ అవుతుండటంతో వీటిలో ఏదో ఒకటి వెనక్కి తగ్గే అవకాశం ఉందని ఇటీవల పలు వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాల నిర్మాతలు అదే రోజున తమ తమ సినిమాలు రిలీజ్ చేసేందుకు పక్కాగా ప్రణాళిక సిద్ధం చేశారని చూడబోతే అదే రోజున బాలయ్య, రవి తేజ మధ్య బాక్సాఫీస్ క్లాష్ తప్పేలాలేదని అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ రెండు సినిమాల విషయంలో ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వరకు వెయిట్ చేయక తప్పదు....!!