పెట్టింది గోరంత .... కానీ వచ్చింది కొండంత .... ఇది రత్నాల స్టామినా ....??
ఆ తర్వాత కథ ఏ విధంగా ముందుకు సాగింది ఆ ముగ్గురు యువకులు హత్యాయత్నం నుంచి ఎలా బయటపడ్డారు అనే కథాంశంతో అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా పక్కా ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి దర్శకుడు అనుదీప్ ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. ముఖ్యంగా ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన నవీన్, ప్రియదర్శి, రాహుల్ ముగ్గురు కూడా తమ తమ పాత్రల్లో ఎంతో ఒదిగిపోయి నటించారు అని చెప్పాలి. దాదాపుగా సినిమా లోని ప్రతి ఒక్క సన్నివేశం ఆడియన్స్ ని గిలిగింతలు పెట్టడంతో పాటు తప్పకుండా మరొకసారి సినిమా చూడాలని అనిపించేలా చేస్తుంది.
ఇక హీరోయిన్ గా నటించిన ఫరియా అబ్దుల్లా తన అందం అభినయంతో ఆడియన్స్ ని అలరించారు. ఓవరాల్ గా ప్రస్తుతం ఇంకా భారీ కలెక్షన్లతో చాలా ప్రాంతాల్లో దూసుకెళ్తున్న ఈ సినిమా ఇప్పటివరకు దాదాపుగా రూ.32 కోట్ల వరకు షేర్ అందుకోగా రూ. 49 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిందని అంటున్నారు. కాగా ఈ సినిమా ఒక బిజినెస్ రూ.12 కోట్ల వరకు జరిగిందని దీన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమా ఇప్పటికే రూ. 20 కోట్ల వరకు ప్రాఫిట్స్ ని అందుకోగా, రాబోయే మరికొద్ది రోజుల్లో మరిన్ని లాభాలు చూడబోతున్నట్లు చెబుతున్నారు విశ్లేషకులు. మొత్తంగా గోరంత పెట్టుబడితో రిలీజైన ఈ సినిమా కొండంత కలెక్షన్లను రాబడుతూ నిర్మాతలకు కాసులు కురిపిస్తోందని తెలుస్తోంది...!!