ఆ హీరో మరణంపై ఎట్టకేలకు నోరు విప్పింది...?
అయితే రాబ్తా సినిమా లో సుశాంత్ తో కలసి స్క్రీన్ షేర్ చేసుకున్న కృతిసనన్ మాత్రం పెదవి విప్పకుండా మౌనాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. ఈ అంశంపై ఆమెను ఉద్దేశించి ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ కృతి స్పందించలేదు. అయితే తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై మొట్టమొదటి సారిగా మాట్లాడింది.
గత ఏడాది నా జీవితంలో చేదు అనుభవాన్ని చవి చూడాల్సి వచ్చింది. సుశాంత్ మరణం నన్ను ఎంతగానో కుంగిపోయేలా చేసింది. ఆ వార్త విన్న క్షణం నుండి నా మానసిక పరిస్థితి అస్సలు బాగాలేదు. సుశాంత్ లాంటి వ్యక్తిని మనం కోల్పోవడం నిజంగా దురదృష్టకరం. అతని మరణం గురించి స్పందిస్తే కొందరు పాజిటివ్ గా మరి కొందరు నెగటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. అందుకే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాను.
సుశాంత్ గురించి స్పందించలేను కానీ అతని మరణం నన్ను ఎంతగానో ఆవేదనకు గురి చేసింది అంటూ చెప్పుకొచ్చారు కృతి. ఎట్టకేలకు స్పందించి తన మనసులోని ఆవేదనను బయటపెట్టారు కృతి. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఈమె కెరీర్ మంచి జోరు మీద ఉంది. రేసెంటుగా ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ లో సీత పాత్రకు ఎంపిక అవడంతోన్ ఎంతో సంతోషంగా ఉంది. ఇది కాకుండా బాలీవుడ్ లో మరి కొన్ని సినిమాలను అంగీకరించింది.