చావు కబురు చల్లగా రెండు రోజుల్లో ఎంత రాబట్టిందంటే...

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ 'ఆర్.ఎక్స్.100' సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యి ఆ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. నటన పరంగా లుక్స్ పరంగా ఆ సినిమాలో కార్తికేయ ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక ఆ సినిమా కూడా యూత్ కి చాలా బాగా కనెక్ట్ అవ్వడంతో కార్తీకేయకి ఫ్యాన్స్ పెరిగారు. ఇక ఆ సినిమా తరువాత వరుస ప్లాపులు అందుకున్న కార్తికేయ ఇక ఆ సినిమా తరువాత "చావు కబురు చల్లగా " సినిమాతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కార్తికేయకు జంటగా హాట్ బ్యూటీ లావణ్య త్రిపాఠి నటించింది. ఇక నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 19న(నిన్న) విడుదలయ్యింది. 'జిఎ2 పిక్చర్స్' బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించగా అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరించాడు. మొన్న విడుదలైన 3 చిత్రాల్లో ఈ చిత్రానికే కలెక్షన్లు బాగా వచ్చాయి. కానీ ఈ చిత్రానికి అయిన బిజినెస్ తో పోలిస్తే ఆ వసూళ్లు తక్కువనే చెప్పాలి.


ఇక 'చావు కబురు చల్లగా' సినిమా రెండు రోజుల వసూళ్ల విషయానికి వస్తే... ఈ చిత్రానికి 13.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు 13.7కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది.మొదటి రోజు ఈ చిత్రం కేవలం 1.67కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.రెండవ రోజు 0.90 కోట్లు వసూళ్లు చేసింది.బ్రేక్ ఈవెన్ కు ఇంకా 11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీకెండ్ గట్టిగా రాబడితే తప్ప.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పాలి.ఇక చూడాలి ఈ చిత్రం ఎంత రాబడుతుందో..ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన సినిమా విషయాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన సినిమా విషయాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: