సీటీమార్ నుంచి మాస్ మసాలా సాంగ్.. మాములుగా లేదుగా..!
ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి మెలొడిబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ భూమిక, బాలీవుడ్ యాక్టర్ తరుణ్ అరోరా కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కి, రీసెంట్గా విడుదలైన జ్వాలా రెడ్డి సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ మూవీ నుండి హాట్ బ్యూటీ అప్సరా రాణి స్పెషల్ సాంగ్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్ . `నా పేరే పెప్సీ ఆంటీ.. నా పెళ్లికి నేనే యాంటీ` లిరికల్ సాంగ్‌ని ఇటీవల విడుదల చేసింది చిత్ర యూనిట్.
అయితే `నా పేరే పెప్సీ ఆంటీ.. నా పెళ్లికి నేనే యాంటీ.. అంటూ సాగే ఈ పాటలో యంగ్ బ్యూటీ అప్సర రాణి హాట్ హాట్ స్టెప్పులతో అదరగొట్టింది. పక్కా మాస్ ఆడియన్స్ ను అలరించేలా మణిశర్మ మాంచి ఐటెం సాంగ్‌ని కంపోజ్ చేశారు. విపంచి రాసిన ఈ పాటను సింగర్ కీర్తన శర్మ అంతే హుషారుగా ఆలపించింది. ఈ సాంగ్ యూత్ అండ్ మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ఇక సీటీమార్ సినిమాను ఏప్రిల్ 2న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్చేయనున్నారు. మరి ఈ సినిమాతో గోపీచంద్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడా చూడాలి మరి.