2020 లో ఓటిటిలో వచ్చినవి ఇప్పుడు థియేటర్లోకి...?
ఈ నేపథ్యంలో కరోనాకు ముందు షూటింగు జరుపుకున్న సినిమాలను ఓటిటి వేదికగా విడుదల చేస్తూ వచ్చారు. దీనితో కొన్ని సినిమాలకు లాభం చేకూరగా మరి కొన్ని సినిమాలు మాత్రం చతికిలబడ్డాయి. ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ అయ్యి సినిమా పరిశ్రమ ఎప్పటిలాగే కళకళ లాడుతోంది. దీని కారణంగా ప్రస్తుతం ఓటిటిలో విడుదలయిన సినిమాలన్నీ థియేటర్లో విడుదల అవుతాయా అనే చర్చ ప్రారంభం అయింది. ఒక వేళ విడుదల చేసినా జనం థియేటర్ కి వస్తారా అన్న సందేహాలు వెలువడుతున్నాయి. థియేటర్లో విడుదల కావాల్సిన చాలా పెద్ద సినిమాలు ఓటిటిలో విడుదల అయ్యాయి.
ఈ సినిమాలలో ముఖ్యంగా నాని సుధీర్ ల కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ "వి" సినిమా ముందుంటుంది. అనుష్క నటించిన నిశ్శబ్దం, రాజ్ తరుణ్ ఒలేయ్ బుజ్జిగా మరియు కీర్తి సురేష్ నటించిన మిస్ ఇండియా, పెంగ్విన్ చిత్రాలు ఉన్నాయి. అంతే కాకుండా హాలీవుడ్ చిత్రాలు సైతం ఓటిటిలో విడుదల అయ్యాయి. ఇందులో ముఖ్యంగా నోలాన్ టెనెట్ చిత్రం కేవలం కొన్ని థియేటర్లలో మాత్రమే విడుదల అయ్యి తర్వాత ఓటీటీలో స్ట్రీమ్ అయ్యింది. మ్యూజికల్ ఎంటర్ టైనర్ "హ్యామిల్టన్" చిత్రం కూడా డిస్నీ ప్లస్ లో స్ట్రీమింగ్ అయ్యింది. డిస్నీ యానిమేషన్ మూవీ సోల్ కూడా స్ట్రీమ్ అయ్యింది. ఇల్లాంటి ఎన్నో సినిమాలు థియేటర్లో విడుదల అవుతాయా..ఒకవేళ అయితే ప్రజలు వీటిని ఆదరిస్తారా చూడాలి.