టాలీవుడ్ హీరో
శర్వానంద్ గురించి అందరికి తెలిసిందే. పలు సినిమాలలో నటించి మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఎక్కువగా కుటుంబ కథా సినిమాలు చేసి ఫ్యామిలీ
ఆడియన్స్ ని సొంతం చేసుకున్నాడు. కాని యూత్ లో క్రేజ్ ని సంపాదించలేకపోయాడు.తనకంటే వెనకాల వచ్చిన హీరోలు కూడా మంచి స్టార్ హీరోలుగా రాణించారు. కాని శర్వ మాత్రం ఇంకా అలానే వుండిపోయాడు.చాలా ప్లాపుల తరువాత శర్వ నటించిన
సినిమా "శ్రీకారం" ఈ సినిమాలో సర్వా కి జంటగా ప్రియాంకా అరుళ్
మోహన్ నటించింది . కిశోర్.బి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం
మార్చి 11న శివరాత్రి కానుకగా విడుదలయ్యింది. మొదటి షో నుండీ ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. మంచి మెసేజ్ ఉందని ప్రశంసలు దక్కించుకున్నప్పటికీ.. టికెట్ రేట్లు పెంచెయ్యడం వలన ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పట్టించుకోలేదు.తాజాగా విడుదలైన సినిమాలతో పోలిస్తే ఈ చిత్రం బెటర్ అని ప్రేక్షకులు అంటున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం పెద్దగా నమోదు కావడం లేదు.
ఇక శ్రీకారం
సినిమా ఇప్పటిదాకా ఎంత రాబట్టిందంటే..శ్రీకారం' చిత్రానికి 17.1 కోట్ల థియేట్రికల్
బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు 17.5కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.11 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 9.57 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ కు ఇంకా 7.93 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అది ఇక కష్టమనే చెప్పాలి..! ఇక అంత రాబట్టడం ఈ సినిమాకి చాలా కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాకి పోటీగా విడుదల అయినా జాతి రత్నాలు మంచి
బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకుపోతుంది. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన
మూవీ అప్ డేట్స్ కోసం
ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...