విజయ్
దేవరకొండ అతి తక్కువ టైం లోనే స్టార్
హీరో అయిన సంగతి తెలిసిందే…ఇక స్టార్ హీరోస్ అన్నాక సూపర్ డూపర్ సినిమాలు చేస్తూ వ్యాపార వేత్తలుగా కూడా దూసుకుపోతుంటారు.ఇక
విజయ్ దేవరకొండ కూడా మంచి వ్యాపారవేత్త అని అందరికి తెలీదు కేవలం కొంతమందికి తెలుసు. ఎక్కువగా సిటీ పీపుల్ వాళ్లకి తెలుసు. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ యాంగిల్ ఇంకా మిగిలిన అందరికీ తెలిసి పోయిందనే చెప్పాలి. ఈ క్రమంలో విజయ్ తన అభిమాన
హీరో సూపర్ స్టార్ మహేష్‌బాబును ఫాలో అవుతున్నాడు.
సినిమా థియేటర్ల రంగంలోకి విజయ్
దేవరకొండ రాబోతున్నాడు. థియేటర్ల పేరు విషయంలో కూడా మహేష్‌బాబును ఫాలో అవుతుండటం గమనార్హం. AMB స్టైల్లో AVD అని పేరు పెడుతున్నాడట.విజయ్
దేవరకొండ సినిమా థియేటర్ సిద్ధమవుతోంది అంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దాంతోపాటే
సినిమా థియేటర్ బయట పేరు లోగో కూడా కనిపిస్తోంది.అందలో AVD అని కనిపిస్తోంది. దీని పూర్తి పేరు కొత్తగా చెప్పక్కర్లేదు. ఏసియన్ విజయ్ దేవరకొండ. ఏసియన్ మహేష్‌బాబులా అన్నమాట.
అంతేకాదు ఈ థియేటర్ విషయంలో ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ఈ థియేటర్లో ప్రదర్శించబోయే
సినిమా చాలా స్పెషల్.ఏవీడీని వచ్చే నెల 9న ప్రారంభిస్తారని సమాచారం. అంటే అర్థమైందిగా ఈ థియేటర్లో మొదటి
సినిమా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్'. పవన్ కల్యాణ్ రీ ఎంట్రీతో విజయ్
దేవరకొండ థియేటర్ బిజినెస్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే రౌడీ బ్రాండ్ తో బట్టల
బిజినెస్ ప్రారంభించి బాగా
సక్సెస్ అయిన
విజయ్ దేవరకొండ ఇక
థియేటర్ విషయంలో తన అభిమాన
హీరో మహేష్ లాగా
సక్సెస్ అవుతాడో లేదో చూడాలి. ప్రస్తుతం
విజయ్ డాషింగ్
డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో "లైగర్"
సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.వరుస ప్లాపులతో వున్న
విజయ్ ఈ సినిమాపై పూర్తి నమ్మకంగా వున్నాడు. చూడాలి ఈ సినిమాతో
విజయ్ ఎలాంటి హిట్ అందుకుంటాడో...