టాలీవుడ్ గాసిప్స్: రామ్ చరణ్, రవితేజ మల్టీస్టారర్ మూవీ.. అందులో విజయ్ సేతుపతి కూడానా..?

Divya

టాలీవుడ్ లో ఇప్పుడు మల్టీ స్టారర్ మూవీ హవా నడుస్తోంది అనే చెప్పవచ్చు. ఆ మూవీస్ లో కొన్ని హిట్ అయ్యాయి. కానీ మల్టీస్టారర్ మూవీస్ అంటేనే మరో సెన్సేషనల్ కింద వస్తుంది. తాజాగా రామ్ చరణ్, రవితేజ  హీరో గా ఓ మల్టీ స్టారర్ మూవీ రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్నాడన్న విషయం మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఆచార్య మూవీ లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని కూడా మనకు తెలిసిందే. రెండు పడవలపై ప్రయాణం చేస్తున్న రామ్ చరణ్ ఒడ్డుకు చేరుకోవాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు తన తండ్రి సినిమాలు మాత్రమే ప్రొడ్యూస్ చేస్తూ వచ్చాడు రామ్ చరణ్.  ఖైదీ నెంబర్ 150, సైరా ఇప్పుడు ఆచార్య సినిమాలు చేస్తూ వచ్చాడు. అయితే తన ఫ్యామిలను, బయట హీరోలని  వాళ్లను కూడా తన నిర్మాణంలో నటింపచేయాలని చూస్తున్నాడట రామ్ చరణ్.


అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.  అంతేకాకుండా రామ్ చరణ్,రవితేజతో ఓ మల్టీ స్టారర్  సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాడు . అందులో విజయ్ సేతుపతి కూడా మరో హీరోగా చేస్తున్నాడట. వీరి కోసం మలయాళంలో కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమాకు డ్రైవింగ్ లైసెన్స్  తో రీమేక్ రైట్స్ కొన్నాడని విశ్వసనీయ వర్గాలు సమాచారం.


ఈ మూవీని జిన్ పాల్ లాల్  తెరకెక్కించగా.. పృథ్వి రాజ్, స్వరాజ్ ప్రధాన పాత్రలో నటించారు. అంతేకాకుండా  లాక్ డౌన్  టైం లో రామ్ చరణ్ ఈ సినిమాలో చూసి తెగ ఎంజాయ్ చేశాడట. ఆలస్యం చేయకుండా ఈ సినిమాకు సంబంధించిన రీమేక్ రైట్స్ కొనేశాడట. అప్పట్లో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని భావించినప్పటికీ వర్కౌట్ కాలేదట. ఈ మధ్య సినిమాల్లో వీరిని తీసుకోవాలనే దానిపై ఒక నిర్ణయానికి వచ్చాడట. పృధ్వి రాజు పాత్రలో మాస్ మహారాజ రవితేజ, సూరజ్ పాత్రలో విజయ్ సేతుపతి, ఫిక్స్ చేశాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: