అరణ్య సినిమా విషయంలో రానా ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా...?

VAMSI
దగ్గుబాటి రానా ఎప్పుడూ విభిన్న కథలను ఎంచుకుంటూ డిఫరెంట్ రోల్స్ లో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తనను తాను ఎప్పుడూ డిఫరెంట్‌గా చూసుకోవాలనే ఈ హీరో చేసే సినిమాలు కూడా రానాకు అంతే గుర్తింపు తెచ్చి పెడుతున్నాయి. ప్రస్తుతం రానా ప్రధాన పాత్రలో నటించి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం అరణ్య . ప్రభు సోల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హిందీలో ‘హాథీ మేరే సాథీ’గా, తమిళంలో ‘కాండ‌న్’గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం కరోనా కారణంగా కాస్త లేట్ అయింది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఈ  సినిమా  మార్చి 26న రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు.

ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ పై స్పీడ్ పెంచారు మేకర్స్. ట్రైలర్ - సాంగ్స్ అంటూ కోలాహలం మొదలైనప్పటికీ  ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ రావడంలేదని సినీ విశ్లేషకుల అంచనా... అయితే మరో వైపు రానా ఫ్యాన్స్ మాత్రం మరో వైపు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. గడిచిన ఆదివారం రాత్రి హైదరాబాద్ పార్క్ హ‌యత్ హోట‌ల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని  ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. అయితే ఇక్కడ కూడా సినిమాపై పెద్ద హైప్ క్రియేట్ కాలేదన్న కామెంట్స్ వినబడుతున్నాయి. సినిమా సూపర్ హిట్ కావాలంటే, ముఖ్యంగా.. ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ప్రేక్షకుల మనసుకు చేరుకోవాలి. కాబట్టి ఈ సినిమాపై ఫుల్ బజ్ క్రియేట్ అవ్వాలి. అందుకోసం భారీగానే ప్లానింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో భాగంగా.. ముందుగా మీడియా మరియు సినీ విశ్లేషకుల కోసం స్పెషల్ షోలు ప్రదర్శించడానికి సన్నాహాలు చేసిందట చిత్ర బృందం. హైదరాబాద్ - ముంబై - చెన్నై వంటి ముఖ్య నగర ప్రాంతాలలో జర్నలిస్టుల కోసం స్పెషల్ షోలు ఏర్పాటు చేసి.. రివ్యూస్ తో ప్రేక్షకుల ఆసక్తిని మరింత గ్రాబ్ చేసేందుకు సిద్ధం చేసినట్లు సమాచారం. మరి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఊహించిన ఫలితాలు రావాలనే, ఇంత కృషి చేస్తున్న చిత్ర బృందానికి మంచి ఫలితాలు రావాలని రానా అభిమానులు ఆశిస్తున్నారు. మరి త్వరలో విడుదల కానున్న అరణ్య చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: