పూరి జగన్నాధ్ నెక్స్ట్ మూవీ ఆ హీరోతోనేనా...?
ఈ సినిమాకు లైగర్ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తుండడం విశేషం. ఈ సినిమా తండ్రి కొడుకుల చుట్టూ జరిగే కథని సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అయితే ఇదంతా ఇలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో ఉండగానే ఈ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ మరో సినిమాను ఓకే చేసినట్లు తెలిసింది. కన్నడలో ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న ధృవ్ సార్జాను హీరోగా ఈ సినిమా తీయనున్నాడట. కాగా ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ ని కూడా పూరి జగన్నాధ్ ధృవ్ సార్జాకు వినిపించడం జరిగిందని సమాచారం.
సదరు హీరోకు స్టోరీ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలిసింది. ఈ సినిమా ఒక్కసారి పట్టాలెక్కిందంటే ఏకకాలంలో నిర్విరామంగా తెలుగు మరియు కన్నడ భాషల్లో షూటింగును జరుపుకుంటుందని వార్తలు వెలువడ్డాయి. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ కూడా అనధికారికంగా వినిపిస్తున్న మాటలు. అయితే త్వరలోనే పూరి జగన్నాధ్ అధికారికంగా ప్రకటన ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.