విజయ్ దేవరకొండని గుడ్డిగా ఫాలో అవుతున్న అల్లు అర్జున్..?

Suma Kallamadi
ప్రముఖ తెలుగు హీరోలు మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెడుతున్నారు. తమకు సొంతంగా థియేటర్లు ఉండాలన్న యోచనతో టాలీవుడ్ హీరోలు మల్టీప్లెక్స్ వ్యాపారం వైపు ముందు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే ఏషియ‌న్ సినిమాస్‌తో క‌లిసి "AMB సినిమాస్ పేరుతో" గ‌చ్చిబౌలిలో ఒక మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మించారు. ఈ విధంగా థియేటర్ వ్యాపారం లో అడుగుపెట్టిన మొట్టమొదటి టాలీవుడ్ హీరోగా మహేష్ బాబు రికార్డు సృష్టించారు.


అయితే మహేష్ బాబు తరహాలోనే రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కూడా మల్టీప్లెక్స్ థియేటర్ ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇప్పటికే ఆయన ఏసియన్ థియేటర్ తో కలిసి "ఎవిడి సినిమాస్" పేరుతో త‌న స్వస్థలమైన మహబూబ్ నగర్ లో ఓ భారీ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఐతే విజయ్ దేవరకొండ సొంత థియేటర్ నిర్మాణం త్వరలోనే పూర్తి కానుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా మల్టీప్లెక్స్ విషయంలో అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ ని గుడ్డిగా ఫాలో అవుతున్నారు. ఇన్నిరోజులు ఒక మల్టీప్లెక్స్ థియేటర్ కట్టాలనే ఆలోచన అల్లు అర్జున్ కి రాలేదు కానీ విజయ్ దేవరకొండ ని చూసి బన్నీ కూడా ఆ దిశగా ముందడుగు వేస్తున్నారు. ఆయన కూడా ఏషియ‌న్ సినిమాస్‌తో క‌లిసి "బ‌న్నీ AAA  సినిమాస్" పేరుతో ఓ మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్‌ ని ప్రారంభించబోతున్నారు.


అయితే ఈ భారీ మల్టీ ప్లెక్స్ అమీర్‌పేట్‌ లో నిర్మించడం విశేషం. అమీర్‌పేట్‌ మంచి పేరున్న సెంటర్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ మూవీ బిజినెస్ అదిరిపోతుంది. దీనివల్ల  అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ బిజినెస్ లాభసాటిగా సాగే అవకాశాలున్నాయి. ఐతే అమీర్‌పేట్‌ మల్టీప్లెక్స్ కి సంబంధించిన నిర్మాణ పనులు శరవేగంగా పూర్తవుతుండగా.. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తున్నాయి. కొద్ది రోజుల్లోనే "బ‌న్నీ AAA  సినిమాస్" నిర్మాణం పూర్తి అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటిస్తుండగా.. లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: