ఇకపై సినిమా థియేటర్ల ముందు...ఆ బోర్డు పెట్టేస్తారట...?
ఆ తరువాత ఎప్పటి లాగే జనమంతా సినిమా హాళ్లకు రావడం సాధారణం అయిపోయింది. దానితో విడుదలయిన సినిమాలు మళ్ళీ లాభాల బాట పట్టాయి. కానీ విడుదల అయిన అన్ని సినిమాలలో నెలకు ఒకటి చొప్పున కేవలం మూడు సినిమాలు మాత్రమే సూపర్ హిట్ సాధించాయి. జనవరిలో విడుదలయిన సినిమాలలో రవి తేజ నటించిన 'క్రాక్’ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత ఫిబ్రవరిలో విడుదలయిన ‘ఉప్పెన’ ఇండస్ట్రీ హిట్ ను సాధించింది. ఇకపోతే గడుస్తున్న నెల మార్చిలో ‘జాతి రత్నాలు’ అనే ఒక చిన్న సినిమా విడుదలయ్యి, ఎవ్వరికీ సాధ్యంకాని హిట్ ను సొంతం చేసుకుంది. ఇవన్నీ చూశాక ఒక విషయం అర్ధం చేసుకోవచ్చు. సినిమాకి హిట్ టాక్ వస్తేనే వసూళ్లు బాగా వస్తున్నాయి. కానీ డివైడ్ టాక్ వచ్చిందంటే...పైసా రావట్లేదు. కానీ గతంలో పరిస్థితి ఇలా ఉండేది కాదు. సినిమాకు మంచి స్పందన లేకపోయినా...ఆ సినిమా నచ్చిన వాళ్లు చూసేవారు.
ఆ విధంగా ...ఆ సినిమాలు కనీసం భారీ నష్టాలు కలుగకుండా తప్పించుకునేవి. ఈ రోజుల్లో మాత్రం హిట్ అయితేనే ఆ సినిమాకు వెళ్తున్నారు. దీనికి కారణం కోవిడ్ వల్ల ఆర్ధికంగా నష్టం ఒకవైపైతే, కరోనా వైరస్ రాకుండా కాపాడుకోవడం మరొకటి. దీని వలన ఇప్పుడు నెలకు ఒక సినిమా కూడా చూస్తున్నట్టు లేరు. ఈ విధంగా ప్రేక్షకులు ఆలోచిస్తుండడం వల్లే చాలా సినిమాలు నష్టాల బాట పడుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తే సినిమా తీసే ప్రతి ఒక్క నిర్మాత మరియు దర్శకుడు హిట్ అయ్యే సినిమాలు మాత్రమే నిర్మించాలని కొందరు కామిక్ గా మాట్లాడుకుంటున్నారు. కాగా ఇప్పుడు థియేటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కనీసం థియేటర్ మైంటైన్ చేయడానికి కూడా డబ్బులు రాకపోవడంతో అప్పుడప్పుడు కొన్ని సినిమా షోలను రద్దు చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో కరోనా పెరగనున్న సందర్భంలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.