రంగ్ దే ఇన్ సైడ్ టాక్ !
రేపు విడుదల కాబోతున్న ‘రంగ్ దే’ మూవీని ఇప్పటికే చూసిన కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు ఈమూవీ గురించి ఇస్తున్న లీకులు ఈమూవీ మరింత అంచనాలు పెంచుతున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ టోటల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని ఈమూవీలో నితిన్ కీర్తీ సురేష్ ల లవ్ కెమిస్ట్రీ ఈమూవీకి హైలెట్ అంటున్నారు.
ఇప్పటికే ఈమూవీకి సంబంధించిన పాటలు యూత్ కు బాగా నచ్చడంతో ఈమూవీ పై అంచనాలు పెరుగుతున్నాయి. ఈమూవీని చూసిన కొందరు ఇస్తున్న లీకుల ప్రకారం ఈమూవీకి హైలెట్ గా పిసి శ్రీరామ్ ఫోటోగ్రఫీ అందరికీ బాగా నచ్చుతుంది అని అంటున్నారు. ముఖ్యంగా నితిన్ తన వయసుకు 10 సంవత్సరాలు చిన్నవాడుగ కాలేజీ స్టూడెంట్ పాత్రలో చాల యాక్టివ్ గా నటించడమే కాకుండా తన శరీరం బరువును తగ్గించుకోవడానికి కొన్నిరోజులు లిక్వీడ్ డైట్ మాత్రమే తీసుకున్న నితిన్ కష్టం ఈమూవీలో అడుగడుగునా కనిపిస్తుంది అని అంటున్నారు.
ఇక సీనియర్ నరేష్ నితిన్ ల మధ్య వచ్చే సన్నివేశానికి సంబంధించిన డైలాగ్స్ విని ప్రేక్షకులు ధియేటర్లలో విరగబడి నవ్వుతారని ఇప్పటికే ఈ సినిమాను చూసిన వారు చెపుతున్నారు. గతనెల విడుదలైన ‘చెక్’ ఫెయిల్ కావడంతో నితిన్ కు ఏర్పడ్డ బాధను ఈమూవీ సక్సస్ తోలిగిస్తుందని అన్న మాటలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఈమూవీకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదేవిధంగా ఈమూవీ ఎడిటింగ్ హైలెట్ గా మారడంతో పాటు ఎవరికీ బోరు అనిపించకుండా ఈమూవీ నిడివి 2.10 నిముషాలకు సెట్ చేయడంతో ఎవరికీ ఈమూవీ బోర్ అనిపించదు అన్న మాటలు ఈసినిమాను ఇప్పటికే చూసినవాళ్ళు చెపుతున్నారు. ఈ వార్తలు ఇలా ఉంటే ప్రస్తుతం పెరిగిపోతున్న కరోనా కేసుల భయాలను పక్కకు పెట్టి 100 శాతం ఆక్యుపెన్సీని కూడ లెక్కచేయకుండా ఈమూవీ ధియేటర్లకు ఫ్యామిలీ ప్రేక్షకులు వచ్చినా రాకపోయినా యూత్ మాత్రం ఈమూవీని చూడటానికి ఈ వీకండ్ లో ధియేటర్లకు భారీ స్థాయిలో వచ్చే ఆస్కారం ఉంది..