కీర్తి సురేష్ టార్చర్ పై నరేష్ షాకింగ్ కామెంట్స్ !

Seetha Sailaja

రేపు విడుదల కాబోతున్న ‘రంగ్ దే’ ఫలితం గురించి నితిన్ తో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడ చాల ఆశక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఒకవైపు కరోనా కేసులు ముంచుకొస్తున్న పరిస్థితులలో ఆభయాలను పక్కకు పెట్టి ధైర్యంగా ప్రేక్షకులు ధియేటర్స్ కు వస్తారా రారా అన్న విషయం ఈమూవీకి వచ్చే ఓపెనింగ్ కలక్షన్స్ ను బట్టి నిర్ణయం జరుగుతుంది.



దీనికితోడు ధియేటర్స్ పార్కులు హోటల్స్ ఆంక్షల విషయంలో కేంద్రప్రభుత్వం ఇచ్చిన సూచనలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్న సందేహాలు వస్తున్నాయి. ఇలాంటి వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పటికీ ధైర్యంగా రిలీజ్ అవుతున్న ‘రంగ్ దే’ మూవీని చాల భారీగా ప్రమోట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో లేటెస్ట్ గా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీనియర్ నరేష్ కీర్తి సురేష్ ప్రవర్తన గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.


కీర్తి ‘మహానటి’ మూవీలో నటించినంత మాత్రాన గంభీరంగా ఉండదని ఆమె విపరీతంగా అల్లరి చేస్తూ ఎదుటివారిని ఎప్పుడు ఒక ఆట పట్టించడానికి తనవంతు ప్రయత్నం చేస్తూ ఉంటుంది అంటూ జోక్ చేసాడు. లాక్ డౌన్ పరిస్థితులు తరువాత తిరిగి షూటింగ్ లు మొదలుపెట్టాక తాను ‘రంగ్ దే’ మూవీ షూటింగ్ కు వెళ్ళినప్పుడు తాను కీర్తితో పడిన పాట్లను వివరించాడు.


షూటింగ్ లో అందరు భయంభయంగా ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ మాస్క్ లు పెట్టుకుని గంభీరంగా కూర్చుని ఉంటే కీర్తి దానికి భిన్నంగా మాస్క్ లేకుండా షూటింగ్ కు వచ్చి అందర్నీ మోహంలో మొహం పెట్టి పలకరిస్తూ మధ్యమధ్య తెగ దగ్గుతూ తమ అందరికీ తెగ టార్చర్ పెట్టిన విషయాన్ని తెలియచేసాడు. అయితే ఆ సమయంలో ఆ టార్చర్ భరించలేక కీర్తి దగ్గరకు వెళ్ళి తనకు 50 సంవత్సరాల వయసు దాటిందని చెపుతూ నిజంగా కీర్తి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పమని ప్రాధేయపూర్వకంగా అడిగినప్పుడు అప్పటి వరకు కీర్తి చేసిన ఈ డ్రామా అంతా అల్లరి అని అర్థం అయింది అంటూ కీర్తిని భరించడం కష్టం అని కామెంట్స్ చేసాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: