టాలీవుడ్ గాసిప్స్ : హీరోయిన్ ప్రేమ ఇకపై తెలుగు ఇండస్ట్రీ పై కనికరం చూపనుందా..!

Divya

మన తెలుగు సినీ ఇండస్ట్రీలో కి అడుగు పెట్టి, తమకంటూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న హీరోయిన్ లలో ప్రేమ ఒకరు. కన్నడ నుంచి సౌందర్య తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కొన్నాళ్ళకే టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయింది. ఇక అదే బాటలోనే అప్పట్లో ప్రేమ కూడా సౌందర్య తర్వాత  అభిమానులలో అంతటి క్రేజ్ ను సంపాదించుకుంది.. అప్పట్లో కొన్ని కొన్ని చిత్రాలలో నటించి ఆ తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరమైంది.


ఇదిలా ఉండగా జనవరి -  6 - 1977  న బెంగుళూర్ లోని కావేరి కొడవ సంఘానికి చెందిన,  నెరవండ కుటుంబములో జన్మించింది. మహిళా సేవా సమాజ హైస్కూల్ లో విద్యను పూర్తిచేసి, బెంగుళూర్ లో ఎస్.ఎస్.ఎమ్.ఆర్.వి. కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. విద్యార్థినిగా ఉన్న దశలోనే పాఠశాల, కళాశాల తరపున జాతీయ స్థాయి హై జంప్, వాలీబాల్ పోటీలలో పాల్గొన్నది. ఆ తరువాత 1995వ సంవత్సరంలో రాజశేఖర్ సరసన "ఓంకారం " సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. అలా మొదటి సినిమాతోనే హిట్ కొట్టడం తో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది ప్రేమ. అంతేకాకుండా ఈ చిత్రానికి ఉత్తమ నటి అవార్డు కూడా పొందింది. అలాగే ఫిలిం ఫేర్ అవార్డులతో పాటు కర్ణాటక ఫిలింఫేర్ అవార్డును కూడా ఈ చిత్రానికి పొందింది..


కోడి రామకృష్ణ దరకత్వంలో వచ్చిన దేవి సినిమాలో నటించి, తెలుగులో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ధర్మ చక్రం,కోరుకున్న ప్రియుడు,ఢీ, చిరునవ్వుతో, జానకి వెడ్స్ శ్రీరామ్, ప్రేమతో రా, రాయలసీమ రామన్నచౌదరి వంటి ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంది. ఇలా ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో అవార్డులను కూడా అందుకున్న తర్వాత మరికొన్ని సినిమాలు తెలుగులో ఫ్లాప్ కావడంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరం అవుతూ వచ్చింది..  ఇక కొద్ది రోజులకు  జీవన్ అప్పాచు అనే ఒక nri ని పెళ్లి చేసుకుంది. 2017 లో అతనితో విడాకులు కూడా తీసుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తూ వచ్చింది. ప్రేమ తెలుగులో చివరగా విష్ణు నాగార్జున నటించిన కృష్ణార్జున సినిమా లో నటించింది.



 ఇక ప్రస్తుతం కన్నడ సినీ ఇండస్ట్రీలోకి తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇకపై తెలుగు లోకి ఎప్పుడు వస్తుందా..?  అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇదివరకే శ్రీమంతుడు సినిమాలో ఒక పాత్ర చేయమని అడిగినప్పుడు ఆమె తిరస్కరించింది. అయితే ఒక మంచి పాత్ర కోసం ఆమె ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా  ప్రేక్షకులు హీరోయిన్ ప్రేమ తన సెకండ్ ఇన్నింగ్స్ ను తెలుగులో ఎలా స్టార్ట్ చేయబోతుంది అనే విషయం కోసం ఎదురు చూస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: