రంగ్ దే కీర్తీ సురేష్ కోసమే రాసుకున్న కథటా...
ఇక ఈ సందర్బంగా హీరో నితిన్ ఈ కథ కీర్తీని ఆదర్శం గా తీసుకొని రాశారు అని చెప్పాడు. నితిన్ మాట్లాడుతూ " 'రంగ్ దే` సినిమా మార్చి 26న మీ ముందుకొస్తోంది. ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఖచ్చితంగా మీ అందరికి బాగా నచ్చుతుంది. ఈ బ్యానర్లో నాకిది మూడవ సినిమా. అ ఆ, భీష్మ ఇప్పుడు `రంగ్ దే`. సో ఆ రెండు సినిమాల్లాగే ఈ సినిమా కూడా ఆడాలని కోరుకుంటున్నాను. రాజమండ్రికి లాస్ట్ టైమ్ `భీష్మ` షూటింగ్‌కి వచ్చాను. సాంగ్ షూట్ కోసం వచ్చాను. ఆ సినిమా హిట్టయింది. `రంగ్ దే` కోసం మళ్లీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. సెంటిమెంట్‌గా మళ్లీ ఆడాలని కోరుకుంటున్నాను. మా ప్రొడ్యూసర్ వంశీగారు ఇక్కడికి రాలేకపోయారు. వెంకీ అట్లూరి ఎప్పటి నుంచో నాకు మంచి స్నేహితుడు. తను సినిమా బాగా చేశాడు. డీఎస్పీగారితో తొలిసారి వర్క్ చేశాను. చాలా అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఈ సాంగ్స్ చాలా రోజుల వరకు గుర్తుంటాయి. సినిమా రిలీజ్ అయ్యాక ఈ పాటలు చాలా పెద్ద హిట్ అవుతాయి. థ్యాంక్యూ దేవీ సర్.. అమేజింగ్ సాంగ్స్ ఇచ్చారు. మన కాంబో ముందు ముందు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. కీర్తీ చాలా మంచి నటి. ఈ సినిమాలో చాలా బాగా చేసింది. తన రియల్ క్యారెక్టర్ అదే. అందరిని టార్చర్ పెడుతూ వుంటుంది. అది చూసి స్ఫూర్తిగా తీసుకుని వెంకీ ఈ కథ రాశారు. మార్చి 26న థియేటర్లో ఈ సినిమా చూడండి. " అని నితిన్ చెప్పాడు.