అసలు బిగ్ బాస్ యాజమాన్యం శింబుని హోస్ట్ గా చేసే ధైర్యం చేస్తుందా?

Purushottham Vinay
బిగ్‌బాస్‌ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా చాలా పాపులర్ అయింది. మొదట హిందీలో పాపులర్ అయినా బిగ్ బాస్ తరువాత తెలుగు తమిళ భాషల్లో కూడా విజయవంతంగా ప్రదర్శింపబడుతూ చాలా క్రేజ్ తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ కి మరో ఆకర్షణ ఏమిటంటే హోస్టులు. స్టార్ హీరోస్ హాస్ట్లుగా వ్యవహారిస్తుంటారు. ఇక విషయానికి వస్తే హోస్టులు అంటే న్యూట్రల్‌గా ఉంటారు అని అంటుంటారు. బిగ్‌బాస్‌ టీమ్‌ ఆలోచనలకు తగ్గట్టుగా వాళ్ల ఆలోచనలు ఉంటాయి తప్ప మరేం కావు. మరోవైపు హోస్టుల సోషల్‌ ఇమేజ్‌ కూడా ముఖ్యంగా పరిశీలిస్తుంటారు. కాంట్రవర్శీలు లేని స్టార్‌ హీరోలను హోస్ట్‌లుగా ఎంపిక చేసుకుంటూ ఉంటారు. మరి ఇంత ఆలోచన చేసే బిగ్‌బాస్‌ టీమ్‌ తమిళంలో వాటికి మించి హోస్టును ఎంపిక చేస్తుందా? తెరపైకి వస్తున్న కొత్త పేరు వింటుంటే అలానే అనిపిస్తోంది.

తమిళ బిగ్‌బాస్‌కు నాలుగు సీజన్లగా విశ్వనటుడు కమల్‌ హాసన్‌ హోస్ట్‌గా చేస్తున్నారు. అయితే త్వరలో ప్రారంభం కాబోయే ఐదో సీజన్‌కి కొత్త హోస్ట్‌ను తీసుకొచ్చే ఆలోచన ఉందని గత కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఎందుకంటే కమల్ ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండడం వలన హోస్ట్ గా తప్పుకుంటున్నాడట.కమల్‌ బదులు శింబు హోస్ట్ గా వ్యవహారిస్తాడు అని సమాచారం అందుతుంది. కమల్‌కు దీటుగా శింబు రాణిస్తాడా అనేది వేరే ప్రశ్న. ఎందుకంటే ఎవరి స్టయిల్‌ వారిది. కానీ పెద్దగా ట్రెండింగ్‌లో లేని, ఫామ్‌లో లేని హీరోను తీసుకుంటారా? అనేది ఓ ప్రశ్న. రెండోది శింబు మీద కొన్ని కాంట్రవర్శీలు ఉన్నాయి. కోలీవుడ్ లో వివాదాలకు కేరాఫ్ అడ్రెస్.ఇవే అడ్డుపడతాయని ఓ వర్గం వాదన. మరి ఈ విషయంలో బిగ్‌బాస్‌ టీమ్‌ ఆలోచనలు ఎలా ఉన్నాయో అసలు ఏం ప్లాన్ చేస్తుందో చూడాలి...ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: