వైరల్ ఫోటో: రష్మికతో కలిసి డిన్నర్‌కు వెళ్లిన విజయ్ దేవరకొండ..!
ప్రస్తుతం విజయ్.. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తుంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, చార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరపగుతుంది. ఇక రష్మిక కూడా సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తుంది. అయితే గత కొంత కాలంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వీరిద్దరూ… కలసి ముంబైలోని ఓ స్టార్ హోటల్లో డిన్నర్‌కు వెళ్లారు. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా.. వీరిద్దరు ఎక్కువగా కలుసుకునేందుకు టైం కేటాయిస్తున్నారంటూ బీటౌన్ లో టాక్ నడుస్తోంది. కాగా సిద్ధార్ధ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న `మిషన్ మజ్ను` సినిమాతో రష్మిక బాలీవుడ్ కు పరిచయం కాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కోసం ముంబై వెళ్లిన రష్మిక అక్కడే ఉన్న విజయ్ దేవరకొండతో కలిసి డేట్ కు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ ఫోటలలో రష్మిక చేతిలో అందమైన వైట్ ఫ్లవర్స్ పట్టుకోని కనిపించింది ఈ భామ. ఇక మరోసారి వీరిద్దరూ కలిసున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. నెటిజన్లు తమకు తోచినట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.