మోనాల్ తో వీడియోకాల్..ప్రేమ క్యాన్సర్ లాంటిదంటూ అఖిల్ పోస్ట్.!
ఇక బిగ్ బాస్ నుండి భయటకు వచ్చిన తరవాత కూడా ఈ జంట పలు టీవీ షోలలో సందడి చేసింది. అంతే కాకుండా ఇద్దరికీ కలిసి ఒక సినిమా ఆఫర్ కూడా రావడంతో ఓకే చెప్పేశారు. గుజరాతి అమ్మాయి తెలుగబ్బాయి పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఇదిలా ఉండగా హౌస్ నుండి బయటకు వచ్చిన తరవాత అఖిల్ మోనాల్ కు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. దాంతో ఫ్యాన్స్ కోరిక మేరకు ఇద్దరూ కలిసి అనేక సార్లు లైవ్ లోకి కూడా వచ్చారు. అయితే తాజాగా అఖిల్ మోనాల్ గజ్జర్ తో మాట్లాడిన వీడియోకాల్ స్క్రీన్ షాట్ ను షేర్ చేసారు. అంతే కాకుండా ఓ కవిత కూడా రాసి అందరికీ షాక్ ఇచ్చారు. ప్రేమ క్యాన్సర్ లాంటిది...అది మర్చిపోయేలా చేస్తుంది. చివరికి ప్రాణం కూడా తీస్తుంది. అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం అఖిల్ పోస్ట్ వైరల్ అవుతోంది.