అప్పుడు.. ఇప్పుడు.. ఎల్లప్పుడూ అంటూ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్..!
చిరంజీవి రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా షేర్ చేసిన వీడియోలో చరణ్ చిన్నప్పుడు గొడుగు పట్టుకుని నిలబడి ఉన్న ఫోటోను చూపెడుతూ అప్పుడు అంటూ.. తాజాగా ఆచార్య సెట్లో రామ్ చరణ్ చిరంజీవికి గొడుగు పడుతున్న ఫోటోను చూపిస్తూ ఇప్పుడు... ఎల్లప్పుడూ అంటూ రామ్ చరణ్ పై ఉన్న ప్రేమను మెగాస్టార్ ఈ విధంగా తెలియజేశారు. . ‘హి ఈజ్ కేరింగ్ సన్..’ అని తెలుపుతూ.. ‘హ్యాపీ బర్త్‌డే మై బాయ్.. గాడ్ బ్లెస్.. అమ్మ అండ్ డాడీ’అంటూ తన కొడుకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక సినిమాల విషయానికొస్తే రామ్ చరణ్ తేజ్ తన తండ్రి చిరంజీవితో కలిసి ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసినదే. అదేవిధంగా రాజమౌళి దర్శకత్వంలో త్రిబుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల అనంతరం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాలో నటించనున్నారనే సంగతి మనకు తెలిసినదే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం చిరంజీవి షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.