రకుల్ ప్రీత్ సింగ్ ని ఇంతలా అవమానించాలా..

Suma Kallamadi
పంజాబీ ఫ్యామిలీ లో పుట్టి ఢిల్లీలో పెరిగిన అందాలతార రకుల్ ప్రీత్ సింగ్ కన్నడ ఫిలిం తో తెరంగేట్రం చేశారు. అనంతరం 2011లో కెరటం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో తెలుగు ప్రేక్షకుల మనసులను అమాంతం దోచేశారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో నటించిన ఆమెకు మంచి గుర్తింపు దక్కింది. అనంతరం ఆమెకు వరుసగా తెలుగులో సినిమా అవకాశాలు వచ్చాయి. రవితేజ, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించారు కానీ ఆ సినిమాలన్నీ కూడా డిజాస్టర్ అయ్యాయి.

దీంతో ఆమెకు ఐరన్ లెగ్ అనే పేరు పడిపోయింది. కానీ ఆమె అందచందాలకు డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. టాలీవుడ్ లో ఇప్పటికీ వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ ఆమె నటించిన ప్రతి చిత్రం డిజాస్టర్ అవుతుండడంతో.. ఆమెను పరోక్షంగా అవమానిస్తున్నారట. నితిన్ హీరోగా నటించిన చెక్ సినిమా లో రకుల్ ప్రీత్ ఓ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం అనూహ్యమైన డిజాస్టర్ ని మూటకట్టుకుంది. దీంతో తెలుగులో ఒక మంచి హిట్ కొట్టడం ఆమెకు కలగా మారి పోయింది.

అందుకే రకుల్ ప్రీత్ తెలుగు పరిశ్రమను వదిలిపెట్టి బాలీవుడ్ కి మకాం మార్చారు. ప్రస్తుతం ఆమె నాలుగైదు హిందీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఓ టాలీవుడ్ సినిమాలో ఆమె చేస్తున్నారు. అలాగే తమిళంలో మరొక సినిమా చేస్తున్నారు. అనేక అవకాశాలతో తీరిక లేకుండా రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలు చేస్తున్నారు కానీ దురదృష్టవశాత్తూ ఒక్కటి కూడా ఆమెకు భారీ హిట్టు తెచ్చి పెట్టడం లేదు. దీనివల్ల ఆమెకు నెగిటివ్ పేరు వస్తోంది. అందాల ఆరబోతకు ఎటువంటి అభ్యంతరం తెలపక పోవడంతో ఆమెకు ఐరన్ లెగ్ అనే పేరు పడినప్పటికీ దర్శకనిర్మాతలు సినిమా అవకాశాలు ఇస్తున్నారు. అయితే ఇదే కొనసాగితే ఆమెను పూర్తిగా పక్కన పెట్టే ప్రమాదం ఉందని చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: