హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతున్న వకీల్ సాబ్ ట్రైలర్....

Purushottham Vinay
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరో పక్క వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.ఇక పవర్ స్టార్ నటించిన తాజా మూవీ 'వకీల్ సాబ్' ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కి రెడీ అవుతోంది.బాలీవుడ్ హిట్ మూవీ "పింక్" కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇక తమిళ్ లో అజిత్ రీమేక్ చేసిన ఈ సినిమా అక్కడ కూడా మంచి సక్సెస్ ని సాధించి మంచి ఘన విజయం సాధించింది..ఇక 'వకీల్ సాబ్' చిత్రాన్ని నిర్మిస్తున్న దిల్ రాజు ఒక్కసారిగా విజృంభించాడు. ఊహించని విధంగా.. అభిమానులకి ఊపిరి తీసుకునే గ్యాప్ ఇవ్వకుండా ప్రమోషన్స్‌ని పీక్స్‌లో నిర్వహిస్తున్నాడు. ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నాడు దిల్ రాజు. ఇప్పటికే వకీల్ సాబ్ ప్రమోషన్స్‌లో భాగంగా పలు నగరాలలో బెలూన్స్‌ని ఎగురవేశారు. ఒక్కో బెలూన్ ఖర్చు 30 వేయిల రూపాయలని తెలుస్తోంది. అలాగే దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సహా చిత్ర యూనిట్ వకీల్ సాబ్ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలని రివీల్ చేస్తూ అంచనాలు మరింతగా పెంచుతున్నారు.



ఇక పవర్ స్టార్, మెగా ఫ్యామిలీ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వకీల్ సాబ్ థియోట్రికల్ ట్రైలర్ రేపు సాయంత్రం 6గం.లకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ 35ఎంఎంలో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ అధికారకంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ గెస్ట్ రోల్‌లో ..నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్ కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: