ఆసక్తికరంగా నితిన్ ‘మాస్ట్రో’ ఫస్ట్‌లుక్ పోస్టర్!
అయితే మంగళవారం నితిన్ పుట్టిన రోజు కావడంతో.. ఆయన కొత్త సినిమా టైటిల్‌తోపాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ చిత్రానికి ‘మాస్ట్రో ‘ అనే పేరును ఖరారు చేస్తున్నట్లుగా ప్రకటించింది నితిన్ టీం. హిందీలో సూపర్ హిట్ సాధించిన అందాదున్ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జూన్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది చిత్రయూనిట్. తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్లో చేతిలో స్టిక్ పట్టుకోని నడుస్తున్నాడు. అంటే ఈ మూవీలో అతను కళ్లు కనపడని వ్యక్తిలా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది.
అంతేకాకుండా.. నితిన్ వెనకాల ఉన్న పియానో పై రక్తపు మరకలు ఉన్నాయి. ఓ కళ్లు కనపడని వ్యక్తి వెనకాల రక్తపు మరకలు ఉండడంతో ఈ వ్యక్తి హత్య చేశాడనే అనుమానం కలిగించేలా పోస్టర్ విడుదల చేసింది యూనిట్. అయితే నితిన్ ఇప్పటివరకు ఇలాంటి పాత్రలో ఎప్పుడూ నటించలేదు. దీంతో ఈ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తుండగా.. జె.యువరాజ్ కెమెరామెన్‌గా చేస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన నితిన్ రంగ్ దే మూవీ అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇందులో నితిన్‌కు జోడీగా కీర్తి సురేష్ నటించింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.