వకీల్ సాబ్ ట్రైలర్ లాంఛ్ లో ఫ్యాన్స్ రచ్చ.. థియేటర్ లో అభిమానులకి గాయాలు..!!
ఈ సందర్భంగా అభిమానులు ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు రావడంతో థియేటర్ అద్దాలు పగిలాయి.దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక వకీల్ సాబ్ విడుదలకు 10 రోజులు మాత్రమే ఉండటంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాల జోరును పెంచింది. పింక్ సినిమా రీమేక్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నాడు వేణు శ్రీరామ్. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఒరిజినల్‌లో లేని చాలా అంశాలను ఇందులో పొందుపరిచాడు దర్శకుడు.
పవన్ మూడేళ్ల తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.ఈ సినిమా కోసం పవన్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు. ఈయన డబ్బింగ్ కూడా పూర్తి చేసాడు.ఈ సినిమాలో పవన్ ఫ్యాన్స్ కోసం రెండు హైలైట్ అంశాలను దాచేసారు దర్శక నిర్మాతలు. వాటిని ఇప్పటి వరకు బయట చెప్పలేదు. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో యాక్షన్ ఎపిసోడ్స్ బాగానే హైలైట్ చేసారు. థియేటర్‌లో అవి మరింత అదిరిపోతాయని చెప్తున్నారు దర్శక నిర్మాతలు...ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు పవన్.. ఇప్పటికే ఈ సినిమా టీజర్ వచ్చి భారీ రెస్పాన్స్ ని కూడా దక్కించుకుంది..!!