యు.ఎస్.ఎ లో విడుదలైన తొలి తెలుగు చిత్రం ఇదే..?
దర్శకుడు పూరీ జగన్నాథ్ తన తొలి చిత్రం బద్రి. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎంతో అద్భుతంగా నటించారు. పూరి జగన్నాథ్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంతో భిన్నంగా చూపించి ప్రేక్షకులను సందడి చేశారు. ఇప్పటికీ ఈ సినిమా అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు.బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా యు ఎస్ ఎ లో విడుదలైన తొలి తెలుగు చిత్రంగా కూడా బద్రి సినిమా రికార్డు సొంతం చేసుకుంది.ఈ సినిమా విజయవంతం కావడంతో అటు దర్శకుడు పూరి జగన్నాథ్ కి, హీరో పవన్ కళ్యాణ్ కు వరుస అవకాశాలు వచ్చాయి.
దాదాపు ఏడు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నలభై ఐదు సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుని 16 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ "నువ్వు నందా అయితే ఏంటి? నేను బద్రి.. బద్రీనాథ్" అని పవన్ చేత చెప్పించిన డైలాగ్ ఇప్పటికీ సంచలనమే. ఎంతో అద్భుతమైన విజయాన్ని సాధించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన రేణు దేశాయ్, అమీషా పటేల్ హీరోయిన్లుగా నటించారు.