ప్చ్ ... పాపం, అవార్డులు వచ్చినా పిలుపులు మాత్రం లేనేలేవట ....??
పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇటీవల మహర్షి సినిమాకి జాతీయ స్థాయిలో అన్ని వర్గాల వారిని అలరించే వినోదాత్మక చిత్రంగా అవార్డు లభించిన విషయం తెలిసిందే. దానితో వంశీ పేరు టాలీవుడ్ వర్గాల్లో మరింతగా మారుమ్రోగుతోంది. ఇక వంశీ తన నెక్స్ట్ మూవీ ని సూపర్ స్టార్ మహేష్ తో చేస్తారనే వార్త కొద్దిరోజులుగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. మరోవైపు నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ మూవీ ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు అందుకుంది. యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఆ మూవీని తెరకెక్కించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన మూవీకి లో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించగా అనిరుధ్ సంగీతం అందించారు.
అయితే ఆ సినిమా తర్వాత గౌతమ్, రామ్ చరణ్ తో ఒక సినిమా చేస్తారు అంటూ ఒక వార్త కొద్దిరోజులుగా ప్రచారమవుతోంది. నిజానికి వీరిద్దరి సినిమాలకు నేషనల్ అవార్డులు దక్కినప్పటికీ కూడా ఇప్పటివరకు వీరిద్దరూ తదుపరి సినిమాలు ప్రకటించకపోవడం, అలానే మరోవైపు అంతటి భారీ అవార్డులు దక్కిన తర్వాత కూడా ఏ హీరో నుండి కూడా వీరికి ఎటువంటి పిలుపు రాకపోవడం ఒకింత షాకింగ్ విషయమేనని పలు టాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు. అయితే అసలు ఈ వార్త నిజమా కాదా, అసలు వీరిద్దరికీ ఏ హీరోలు అయినా ఛాన్స్ ఇచ్చారా లేదా అనే విషయాలపై క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు వరకు వెయిట్ చేయక తప్పదంటున్నారు విశ్లేషకులు....!!