నితిన్ దెబ్బకి ఆ డైరెక్టర్ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందా .... ??

GVK Writings
గతేడాది భీష్మ మూవీతో మంచి విజయాన్ని అందుకున్న యువ నటుడు నితిన్ ఇటీవల చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చెక్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చి భారీ పరాజయాన్ని మూట కట్టుకున్నారు. ప్రియా ప్రకాష్ వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా తెరకెక్కిన ఈ సినిమాని భవ్య క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. దాని తర్వాత నితిన్ నటించిన లేటెస్ట్ సినిమా రంగ్ దే. కొన్నాళ్ళ క్రితం ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం మంచి టాక్ తో అలానే కలెక్షన్ తో కొనసాగుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశం నిర్మించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి మ్యూజిక్ అందించాడు.

మిస్టర్ మజ్ను, తొలిప్రేమ సినిమాల దర్శకుడు అట్లూరి వెంకీ రూపొందించిన ఈ లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నితిన్, కీర్తి సురేష్ ల జోడికి ఆడియన్స్ నుంచి మంచి పేరు దక్కింది. నిజానికి కథ పరంగా ఓల్డ్ స్టోరీనే తీసుకున్న దర్శకుడు వెంకీ దానిని యువతతో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా తీయడంలో మాత్రం సఫలమయ్యారు అని చెప్పాలి. ముఖ్యంగా సినిమాలోని కొన్ని వన్ లైన్ డైలాగులు కామెడీ పంచులు ఆడియన్స్ ని ఎంతో అలరిస్తున్నాయి. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి కూడా అందరి నుంచి మంచి స్పందన వస్తుంది. తొలిప్రేమ మూవీతో మంచి విజయాన్ని అందుకున్న వెంకీ అట్లూరి మిస్టర్ మజ్ను తో ఎబోవ్ యావరేజ్ విజయాన్ని అలానే ప్రస్తుతం రంగ్ దే మూవీ తో మరొక మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి.

అయితే అసలు మ్యాటర్ ఏంటంటే, రెండు రోజుల క్రితం ఒక యువ స్టార్ హీరో నుండి వెంకీ అట్లూరికి పిలుపు వచ్చిందని తనకోసం ఒక మంచి స్టోరీ ని సిద్ధం చేయమని సదరు స్టార్ హీరో చెప్పడంతో ప్రస్తుతం వెంకీ అట్లూరి ఆయన కోసం కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారని అంటున్నారు. అన్ని వర్కౌట్ అయితే అతి త్వరలో ఒక భారీ నిర్మాణ సంస్థ రూపొందించనున్న ఈ మూవీకి సంబంధించి అధికారిక న్యూస్ కూడా బయటకు రావడం ఖాయమని చెప్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త నిజమే అయితే రంగ్ దే ఖచ్చితంగా వెంకీ అట్లూరి లైఫ్ ని మార్చేసినట్లే అని, ఆ విధంగా నితిన్ ద్వారా వెంకీ కి మంచి టర్నింగ్ పాయింట్ దక్కినట్లే అని అంటున్నారు విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: