పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ తరవాత నటించిన సినిమా వకీల్ సాబ్. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వకీల్ సాబ్ కు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. లైంగిక హక్కుల కోసం చేసే పోరాటం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్ శృతి హాసన్ నటింస్తోంది. ఇక ఈ సినిమాలో అంజలి, నివేధిత తామస్, అనన్య నాగోళ్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ విడుదల చేసిన 24 గంటల్లో 22 మిలియన్ల వ్యూవ్స్ తో టాలీవుడ్ రికార్డులు షేక్ చేసింది. ఇక ఎప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా వకీల్ సాబ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దాంతో సినిమా ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ వేగంగా జరుపుతోంది. అంతే కాకుండా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ గ్రాండ్ గా ప్లాన్ చేసింది. కాగా ఈవెంట్ పర్మిషన్ కోసం బంజారాహిల్స్ పోలీసులకు లేఖ రాయగా పోలీసులు అనుమతి నిరాకరించారు. దాదాపు నాలుగు నుండి ఐదు వేల మందితో ప్రీరిలీజ్ ఈవెంట్ ను జరపాలని మేకర్స్ భావించారు. కానీ ప్రస్తుతం కరోనా ఉదృతి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఈవెంట్ కు నో చెప్పారు. అయితే తాజా టాక్ ప్రకారం ప్రీరిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట. పవన్ కల్యాణ్ ఎప్రిల్ 4వ తేదీన పొలిటికల్ మీటింగ్ కోసం తిరుపతి వెలుతున్నారు. అయితే ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా కలిసి వచ్చేలా తిరుపతిలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే తిరుపతిలోనూ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించడంలేదు. కరోనా నేపథ్యంలో కేవలం సినిమాలో నటించిన నటీనటులు మరియు సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ మాత్రమే ఈవెంట్ కు హాజరు కానున్నారు. ఇక పవన్ అభిమానుల కోసం ఈవెంట్ ను టెలివిజన్ లో ప్రసారం చేస్తారట. వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ రోజునే పవన్ అభిమానులు థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున హంగామా సృష్టించారు. ఇక సినిమా విడుదల నాడు సెలబ్రేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.