అభిమానుల సంకేతాలతో కన్ఫ్యూజ్ అవుతున్న పవన్ !

Seetha Sailaja
‘వకీల్ సాబ్’ ట్రైలర్ కు 180 లక్షల వ్యూస్ ఇప్పటికే వచ్చి ఈ ట్రైలర్ 2 కోట్ల వ్యూస్ టార్గెట్ వైపు పరుగులు తీస్తోంది. ‘వకీల్ సాబ్’ విడుదల అయ్యే సమయానికి ఈ ట్రైలర్ కు 2 కోట్ల వ్యూస్ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఒక సినిమా ట్రైలర్ కు ఈవిధమైన స్థాయిలో వ్యూస్ రికార్డులు రావడం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది.

ఈ రికార్డులను చూసి పవన్ అభిమానులు జోష్ లోకి వెళ్ళిపోతుంటే కొంతమంది విశ్లేషకులు మాత్రం కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో పవన్ ‘జనసేన’ కు  సుమారు 22 లక్షలు. అప్పుడు జరిగిన ఎన్నికలలో పవన్ జనసేన కు వచ్చిన ఓట్లు 7 శాతం మాత్రమే.

పవన్ ను అభిమానించే అభిమానుల కుటుంబాలలోని కుటుంబ సభ్యులు వారి బంధువులు ఓట్లు వేస్తే పవన్ భీమవారం గాజువాక స్థానాలలో చాల సులువుగా గెలిచి ఉండేవాడు. పవన్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ నినాదాలు చేసిన వీరాభిమానులు రంగంలోకి దిగి ఓట్లు వేయించగలిగి ఉంటే పవర్ స్టార్ కు గత ఎన్నికలలో ఇలాంటి పరాభవం వచ్చి ఉండేది కాదు అని అంటారు.

అయితే ఇంత పరాభవం జరిగిన తరువాత కూడ తిరిగి యూటర్న్ తీసుకుని ఒక రీమేక్ సినిమాగా పవన్ నటించిన ‘వకీల్ సాబ్’ ట్రైలర్ కు వస్తున్న వ్యూస్ సుమారు లక్ష పైగా వచ్చిన లైక్స్ చూసిన వారికి పవన్ ను రాజకీయ నాయకుడుగా కంటే పవర్ స్టార్ గానే ప్రేక్షకులు ఆదరిస్తారు అన్న విషయం మరొకసారి రుజువైంది. అయితే పవన్ మనసు మాత్రం పూర్తిగా రాజకీయాల పై ఉండటంతో తన రెండు పడవల సిద్ధాంతాన్ని కొనసాగిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో అభిమానుల నుంచి వస్తున్న సంకేతాలను పవన్ కళ్యాణ్ పట్టించుకుంటే మంచిది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అనుమతులు నిరాకరించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: