సల్మాన్ ఖాన్ నన్ను మోసం చేశాడు..నటి సంచలన ఆరోపణలు..!
తాను సినిమాల్లోకి వచ్చింది హీరోయిన్ అవకాశాల కోసం కాదని సల్మాన్ ఖాన్ పైన ఉన్న అభిమానంతోనే వచ్చానని తెలిపింది. సల్మాన్ ఖాన్ ను పెళ్లి చేసుకునేందుకే సినిమాల్లోకి వచ్చానని చెప్పింది. అంతే కాకుండా ఇద్దరం పెళ్లి చేసుకుందామని అనుకున్నామని కానీ సల్మాన్ ఖాన్ తనను మోసం చేసాడని తెలిపింది. ఆ తరవాత తాము దూరమయ్యామని ఎవరి లైఫ్ లో వారు బిజీ అయ్యామని తెలిపింది. ఇక ముంబైలో మోడల్ గా ఉండగానే షోమికి సినిమా అవకాశాలు వచ్చాయి. దాంతో పలు సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఖిలాడీ సినిమాలో షొమి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో ఘన విజయం సాధించడంతోనే ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఇక ఆరేళ్ల పాటు సల్మాన్ షోమీ జంట ప్రేమాయణం నడపటం తో ఇండస్ట్రీలోహాట్ టాపిక్ గా ఉండేవారు. ఇక ప్రస్తుతం షోమి ఓ ఎన్జీవో సంస్థను నడిపిస్తోంది. మళ్లీ సినిమాల్లోకి వచ్చే ఇంట్రస్ట్ లేదని చెప్పింది.