తన సినీ కెరీర్లో రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..?

kalpana
2007వ సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరుత సినిమా ద్వారా మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని సాధించారు. తరువాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన మగధీర సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డు బద్దలు కొట్టింది. ఇక అప్పటి నుంచి రామ్ చరణ్  ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతూ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా సినిమాలు చేస్తున్నారు.చరణ్ ఇండస్ట్రీలోకి వచ్చి 13 సంవత్సరాలు అవుతున్నప్పటికీ తన సినీ కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. అదేవిధంగా కొన్ని సినిమాలను కూడా రామ్ చరణ్ వదులుకున్నారు. అయితే చరణ్ వదులుకున్న వాటిలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన సినిమాలు కూడా ఉన్నాయి. చెర్రీ వదులుకున్న ఆ సినిమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం...

1) సూర్య సన్ ఆఫ్ కృష్ణన్:
దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ క్లాసికల్ చిత్రం అని చెప్పవచ్చు. ఈ సినిమాలో నటించడం కోసం దర్శకుడు ముందుగా రామ్ చరణ్ ను సంప్రదించగా ఆ సమయంలో రామ్ చరణ్ మగధీర సినిమా చేస్తూ బిజీగా ఉండటంతో ఈ సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకున్నారు.

2) లీడర్:
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లీడర్ సినిమా కథ ముందుగా రామ్ చరణ్ కి చెప్పగా అందుకు రామ్ చరణ్ నో చెప్పడంతో ఈ సినిమా కథ బన్నీ దగ్గరికి కూడా వెళ్ళింది. బన్నీ కూడా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోకపోవడంతో ఫైనల్ గా సురేష్ ప్రొడక్షన్ లో రానా ఈ సినిమాలో నటించారు.

3) డార్లింగ్:
ప్రభాస్ కు మంచి గుర్తింపును సంపాదించిన సినిమా డార్లింగ్ అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో నటించే అవకాశం ముందుగా రామ్ చరణ్ కి రాగా,ఈ సినిమా చేయడం కోసం ప్రభాస్ అయితే బాగుంటుందని చరణ్ స్వయంగా చెప్పడంతో ఈ సినిమా చేసే అవకాశం ప్రభాస్ కి దక్కింది.

4) ఎటో వెళ్ళిపోయింది మనసు:
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నటించడం కోసం రామ్ చరణ్ కి కథ వినిపించినప్పటికీ రామ్ చరణ్ రెండవసారి కూడా గౌతమ్ మీనన్ సినిమాలో రిజెక్ట్ చేశారు. తరువాత ఈ సినిమాలో నాని నటించారు.

5) కృష్ణం వందే జగద్గురుమ్:
దర్శకుడు క్రిష్, చరణ్ ఎంతో మంచి స్నేహితులు ఈ సినిమాలో నటించడం కోసం క్రిష్ ముందుగా చరణ్ ను సంప్రదించగా.. ఈ సినిమాలో నటించడం కోసం రానా ఫైనల్ అయ్యారు.

6) శ్రీమంతుడు:
రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఈ ముగ్గురికి ఈ సినిమా కథను దర్శకుడు కొరటాల శివ వినిపించగా ఈ ముగ్గురు ఈ సినిమా చేయడం కోసం ఆసక్తి చూపించకపోవడంతో ఈ సినిమాను మహేష్ బాబు చేశారు. శ్రీమంతుడు సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో మనకు తెలిసిందే.

7) మనం:
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ క్లాసికల్ చిత్రంగా మనం సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమాలో నటించడానికి చరణ్ నో చెప్పడంతో తర్వాత మరికొంతమంది హీరోలను కూడా దర్శకుడు సంప్రదించారు. ఫైనల్ గా మనం సినిమా అక్కినేని కుటుంబం కోసమే రాసినట్టుగా ఉందిthana

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: