ఆయన మహేష్ తో, ఈయన ఎన్టీఆర్ తో అన్నారు ... ప్చ్ ... చూస్తుంటే వర్కౌట్ అయ్యేలా లేదు ....??
అలానే దాని తర్వాత దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో కె.ఎల్.నారాయణ నిర్మాతగా రూపొందనున్న భారీ పాన్ ఇండియా సినిమాలో మహేష్ బాబు నటించనున్నారు. అయితే ఈ సినిమాలతో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా అలానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరొక సినిమా కూడా మహేష్ చేయనున్నారని సమాచారం. ఇక వీటితో పాటు ఇటీవల మాస్టర్ మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూడా మహేష్ బాబు ఓ సినిమా చేయనున్నారని, కొన్నాళ్ళ క్రితం మహేష్ ను ప్రత్యేకంగా కలిసిన లోకేష్ ఆయనకు ఒక అద్భుతమైన స్టోరీ లైన్ వినిపించటం అది ఆయనకు ఎంతో నచ్చడంతో ప్రస్తుతం దాని స్క్రిప్టు సిద్ధం చేసే పనిలో లోకేష్ ఉన్నారని అంటున్నారు. అయితే ఈ సినిమాపై మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా ప్రకటన రాలేదు. మరోవైపు ఇటీవల అరవింద సమేత మూవీ తో భారీ కమర్షియల్ సక్సెస్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా అక్టోబర్ 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు నిర్మించనున్న భారీ సినిమాలో ఎన్టీఆర్ నటించనున్నారు. ఇప్పటికే స్టోరీ తో పాటు స్క్రిప్టు వర్క్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చేనెల ప్రథమార్ధంలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా, అలానే తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా ఎన్టీఆర్ చేయనున్నట్లు తెలుస్తోంది. నిన్నటి నుండి పలు బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అట్లీ తన తదుపరి సినిమా ని షారుక్ ఖాన్ తో చేయడం ఫిక్స్ అయిందని, త్వరలో ఈ మూవీకి సంబంధించి పూర్తి అధికారిక వివరాలు వెల్లడవుతాయని అంటున్నారు. ఒకవేళ ఇదే గనుక నిజమైతే ఇప్పట్లో అట్లీ తో ఎన్టీఆర్ సినిమా ఉండే అవకాశమే లేదంటున్నారు. ఈ విధంగా అటు మహేష్ తో లోకేష్ కనకరాజ్ ఇటు ఎన్టీఆర్ తో అట్లీ సినిమాలు ఇప్పట్లో ఉండే పరిస్థితి లేదని తెలుస్తోంది.....!!