కొత్త టాలెంట్ ని టాలీవుడ్ కి పరిచయం చేయబోతున్న పవన్ కళ్యాణ్..?
"పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్ఎల్పి" ప్రొడక్షన్ కంపెనీ ని టీజీ విశ్వ ప్రసాద్ స్థాపించారు. ప్రస్తుతం ఆయన తన నిర్మాణ సంస్థ ద్వారా చాలా ఫ్యూచర్ ఫిలిమ్స్ తీస్తున్నారు. అయితే క్రియేటివ్ వర్క్స్ తో కలిసి 6 చిన్న సినిమాలు, 6 మీడియం రేంజ్ సినిమాలు, 3 భారీ సినిమాలు చేస్తున్నారట. రచయితల కొత్త ఆలోచనలను వెండితెరపై దృశ్య కావ్యంగా మలచడమే పవన్ కళ్యాణ్ యొక్క ముఖ్య లక్ష్యం కాగా.. ఆయన టీజీ విశ్వ ప్రసాద్ తో కలిసి తన కలను నెరవేర్చుకోవడానికి ముందడుగు వేస్తున్నారు.
ఐతే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న హరీష్ కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా నిర్మాణ సంస్థలు కలసి పనిచేసేలా కృషి చేస్తున్నారు. అయితే ఈ సినిమాలు ప్రజలలోకి వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ అతిధి పాత్రలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.